Ads
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే రీ ఎంట్రీ లో వచ్చిన ఖైదీ నెంబర్ 150, సైరా సినిమా లు యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. ఆచార్య సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. దీంతో మెగా అభిమానులు చిరు నుంచి ఒక సూపర్ హిట్ ఆశిస్తున్న తరుణం లో వచ్చింది గాడ్ ఫాదర్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని.. అభిమానుల్ని అలరించింది.
Video Advertisement
దసరా పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.ఇక ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారనే విషయం మనకు తెలిసిందే. ఈ సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా తమన్ మాట్లాడుతూ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు..
మలయాళ చిత్రం లూసిఫర్ రీమేక్ కి గాడ్ ఫాదర్ టైటిల్ ఫిక్స్ చేశారు. చిరంజీవి మాస్ ఇమేజ్ కి , ఆయన స్టార్ డమ్ కి చక్కగా సరిపోయింది. ఈ టైటిల్ ని సెట్ చేసింది దర్శకుడు మోహన్ రాజా కాదు అన్న విషయం తెలిసిందే. ఈ చిత్ర వర్కింగ్ టైటిల్ సర్వాంతర్యామి. ఆ టైటిల్ తోనే షూటింగ్ పూర్తి చేశారు.
అయితే గాడ్ ఫాదర్ టైటిల్ ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సూచించాడు. గతంలో మీరు నటించిన గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు టైటిల్స్ లెటర్ ‘జీ’ అక్షరంతో తో మొదలయ్యాయి. బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి, అని థమన్ అన్నారట. ఆయన సూచించిన గాడ్ ఫాదర్ టైటిల్ అందరికీ నచ్చడంతో ఫైనల్ చేశారట. ఇకపోతే ఈ సినిమా కోసం గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను తమన్ ఎంపిక చేశారని ఇదివరకే సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ పేర్కొన్న విషయం మనకు తెలిసిందే.
గాడ్ ఫాదర్ టైటిల్ కి పెద్ద హిస్టరీ ఉంది. హాలీవుడ్ లో ఇది ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన మూవీ. గ్యాంగ్ స్టర్ చిత్రాలకు రిఫరెన్స్ గా నిలిచిన మూవీ. అయితే చిరంజీవి చిత్రానికి గాడ్ ఫాదర్ టైటిల్ పెట్టడంపై హాలీవుడ్ మూవీ గాడ్ ఫాదర్ నిర్మాతల నుండి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయట. చివరికి వాళ్ళ నుండి అనుమతి తీసుకోవడం జరిగిందట. సినిమా విడుదలకు వారం రోజుల ముందు మాత్రమే ఎన్ ఓ సి లభించినట్లు చిరంజీవి వెల్లడించారు.
కొన్ని టైటిల్స్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. సినిమాపై అంచనాలు పెంచేస్తాయి. అలాంటి టైటిలే గాడ్ ఫాదర్. ఒకవేళ ఈ చిత్రం ఒకవేళ సర్వాంతర్యామి టైటిల్ తో మూవీ విడుదల చేస్తే ఫలితం ఎలా ఉండేదో.. ఇక ప్రస్తుతం తమన్ కూడా ఈ సినిమా టైటిల్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
End of Article