ఇంగ్లీష్ వింగ్లిష్ లో శ్రీదేవి కట్టిన చీరల్ని ఏం చేసారో తెలుసా..??

ఇంగ్లీష్ వింగ్లిష్ లో శ్రీదేవి కట్టిన చీరల్ని ఏం చేసారో తెలుసా..??

by Anudeep

Ads

అతిలోక సుందరి శ్రీదేవి కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. బాల నటిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టి.. అన్ని భాషల్లోనూ నటించి ..ప్రేక్షకుల్ని అలరించి.. భారతీయ సినీ పరిశ్రమలోనే ఓ పేజీని లిఖించింది. ఎన్నో అవార్డులు..రివార్డులతోనూ అతిలోక సుందరి ఖ్యాతి ని ఆర్జించారు. దశాబ్ధాల పాటు సాగిన శ్రీదేవి ప్రయాణం ఎంతో ఆసక్తిరం..అద్భుతం.

Video Advertisement

 

కెరీర్ పీక్స్ లో ఉండగానే 1996లో బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ని వివాహం చేసుకుని సినిమాలకు పుల్ స్టాప్ పెట్టారు. 15 సంవత్సరాలు కుటుంబానికే అంకితం చేసి.. తిరిగి 2012లో ఇంగ్లిష్ వింగ్లిష్ తో అభిమానుల ముందుకు వచ్చింది. అందులో ఇంగ్లీష్ రాని మహిళ పాత్రలో ఆద్యంతం ఆకట్టుకున్నారు.
తాజాగా ఆ సినిమా విడుదలై అక్టోబర్ 5కి దశాబ్దం పూర్తయింది. ఈ సందర్బంగా ‘ఇంగ్లీష్ ..వింగ్లీష్’ జ్ఞాపకాలు ఎప్పటికి పదిలమే అంటూ యూనిట్ ఆ సినిమాలో శ్రీదేవి ధరించిన చీరలు వేలం వేయడానికి రెడీ అయింది.

the sarees which sri devi wore in english-vinglish are now available for auction
“ఆ సినిమా రిలీజ్ తర్వాత శ్రీదేవి నటనతో పాటు..ఆమె ధరించిన చీరలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో శ్రీదేవితో ఓ ఫ్యాషన్ షో ఏర్పాటు చేసి ఆ చీరల్ని వేలం వేయాలనుకున్నాం. కానీ ఆమె హఠాత్తుగా మరణించడంతో అది సాధ్యపడలేదు.

the sarees which sri devi wore in english-vinglish are now available for auction

ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొంత ఆలస్యం జరిగింది. తాజాగా ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ చీరల్ని వేలం వేయాలని నిర్ణయించాం. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసే ఎన్ జీవోలతో చర్చిస్తున్నాం. ఆ వేలంలో వచ్చిన డబ్బుతో ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా థీమ్ లాగా.. అమ్మాయిల చదువులకు ఖర్చు చేయాలని ప్లాన్ చేస్తున్నామని” చిత్ర దర్శకురాలు గౌరి షిండే అధికారికంగా ప్రకటించారు.

the sarees which sri devi wore in english-vinglish are now available for auction
శ్రీదేవి చీర కట్టులో ఎంతో అందంగా కనిపిస్తారు. అన్ని భాషల్లోనూ శ్రీదేవి అందమైన నటిగా ఫేమస్ అవ్వడానికి ఆ చీరకట్టు ఓ కారణం. హీరోయిన్ గా నటిస్తోన్న క్రమంలో ఆమె చీరకట్టుకు ప్రత్యేక అభిమానులుండేవారు. శ్రీదేవి చీర పోస్టర్ గోడ మీద పడిందంటే అప్పటి యువతలో ఒకటే ఎగ్జైట్ మెంట్ కనిపించేది. ఎంతో మంది మహిళా అభిమానులు ఆమె చీర కట్టును అనుసరించేవారు.

the sarees which sri devi wore in english-vinglish are now available for auction
‘ఇంగ్లీష్..వింగ్లీష్’ లో కూడా మరోసారి అదే చీరకట్టును హైలైట్ చేసారు. ఇప్పుడా అందాల నటి చీరల్ని వేలం వేయడం విశేషం. మరి వాటిని దక్కించుకునే అదృష్ట వంతులెవరో? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..


End of Article

You may also like