Ads
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ టోటల్ డీగ్లామర్ లుక్‌లో సరికొత్తగా కనిపించాడు. మాసిన బట్టలు, జుట్టు, గడ్డంలో తన యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను అలరించాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ మేనరిజం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా తగ్గేదేలే డైలాగ్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.
Video Advertisement
పుష్ప మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా యాక్ట్ చేయగా.. ఎస్పీ భన్వర్‌సింగ్ షేకావత్ పాత్ర మలయాళం స్టార్ ఫహద్ ఫాజిల్ నటించారు.
త్వరలో పుష్ప ది రూల్ సెట్స్‌పైకి వెళ్లనుంది. స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ కావడంతో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్న తీమ్ ఈ మూవీని దీపావళి తరువాత సెట్స్ పైకి తీసుకెళ్లబోతోంది.ఫస్ట్ పార్ట్ రికార్డు స్థాయి విజయాన్ని సాధించడంతో ‘పుష్ప 2’ ని భారీ స్థాయిలో తెరకెక్కించాలని భారీ బడ్జెట్ ని కూడా కేటాయించారు. రూ. 350 కోట్లకు మించి ఈ ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేయబోతున్నారట.
పుష్ప’ని ముందు రెండు భాగాలుగా తెరపైకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేయలేదు. అయితే చివరి నిమిషంలో ప్లాన్ మార్చుకుని రెండు భాగాలుగా చేస్తున్నామంటూ ప్రకటించారు. అయితే దీన్ని రెండు భాగాలతో ఎండ్ చేయాలనే ఉద్దేశం సుకుమార్ కు ఆయన టీమ్ కు లేదని తెలుస్తోంది. పార్ట్ 2 ఎండింగ్ లో మరో భాగానికి లీడ్ ని వదలాలని సుకుమార్ ఆయన టీమ్ ప్లాన్ చేస్తున్నారట. రీసెంట్ గా విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ‘కేజీఎఫ్ 2’ ఫీవర్ కారణంగానే ‘పుష్ప’ టీమ్ సీక్వెల్ కి సీక్వెల్ ప్లాన్ చేస్తోందని ఇన్ సైడ్ టాక్.
అయితే పార్ట్ 3 కి లీడ్ ఇచ్చే సీన్ కోసం ఇప్పడు కసరత్తు మొదలైందని అది సెట్టయితే ‘కేజీఎఫ్ 3’ తరహాలో ‘పుష్ప 3’ ని కూడా తెరపైకి తీసుకొస్తారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫైనల్ క్లైమాక్స్ సీన్ కోసం ‘పుష్ప’ టీమ్ డైరెక్టర్ సుకుమార్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
పుష్ప-3 మూవీకి స్కోప్ ఉందని సుకుమార్ తనతో చెప్పినట్లు ఫహద్ ఫాజిల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన వ్యాఖ్యలతో పుష్ప పార్ట్-3 కచ్చితంగా ఉంటుందని సినీ ప్రేక్షకులు చెబుతున్నారు. దీని బట్టి చూస్తే పార్ట్ 3 తీస్తున్నట్టే ఉన్నాడు సుక్కు అంటున్నారు ఆయన అభిమానులు. పుష్ప-2 మూవీ షూటింగ్ ఆగస్టులో మొదలుపెట్టి.. వచ్చే సమ్మర్‌కు ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చే ప్లాన్ ఉన్నారు మూవీ మేకర్స్.
End of Article