ఆ తమిళ సినిమా “రీమేక్” లో నెగిటివ్ పాత్రలో రవితేజ..? హీరో ఎవరంటే..?

ఆ తమిళ సినిమా “రీమేక్” లో నెగిటివ్ పాత్రలో రవితేజ..? హీరో ఎవరంటే..?

by Anudeep

Ads

ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా, అలాగే సహాయ పాత్రల్లో కూడా నటించి ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగిన నటుడు రవి తేజ. రవి తేజ గత కొంత కాలం నుండి వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా సరైన ఫలితం రావట్లేదు.

Video Advertisement

రవితేజ ఇటీవల హీరోగా నటించిన రామారావు డ్యూటీ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా కథ బానే ఉన్నా కూడా టేకింగ్ లో జాగ్రత్త వహించక పోవడంతో ఆశించిన ఫలితం రాలేదు. ఇప్పుడు రవితేజ ధమాకా సినిమాలో నటిస్తున్నారు. రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మిరపకాయ్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఈ సినిమా తర్వాత మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు అని సమాచారం. అది కూడా తెలుగు సినిమా కాదు. ఒక తమిళ్ సూపర్ హిట్ రీమేక్ సినిమా. ఇటీవల శింబు హీరోగా నటించిన మానాడు తమిళ్ లో రూపొందింది. తెలుగులో కూడా డబ్ చేశారు. రెండు భాషల్లో సినిమా హిట్ అయ్యింది. కానీ ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో ముందు రానా దగ్గుబాటి హీరోగా నటిస్తారు అన్నారు.

ravi teja will be acting in negative role in this tamil movie remake

ఆ తర్వాత రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ హీరోగా నటిస్తున్నాడు అని అన్నారు. ఇప్పుడు మరొక విషయం బయటికి వస్తోంది. ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఇందులో రవితేజ నటించబోతున్నారు. అయితే ఇందులో రవితేజ హీరో పాత్రలో నటించడం లేదు. ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించిన ఎస్.జె.సూర్యకి దాదాపు హీరో పాత్రకి ఉన్నంత స్క్రీన్ స్పేస్ ఉంది. సినిమాకి ఎస్.జె.సూర్య పాత్ర ఒక హైలైట్ గా నిలిచింది. ఎస్.జె.సూర్య ఒక పోలీస్ పాత్రలో ఈ సినిమాలో నటించారు.

ravi teja will be acting in negative role in this tamil movie remake

అంతే కాకుండా మరొక విషయం ఏమిటంటే ఈ సినిమా తెలుగులో డబ్ అయినప్పుడు ఎస్.జె.సూర్య తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. దాంతో డైలాగ్స్ కూడా చాలా హిట్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ పాత్రని తెలుగులో రవితేజ పోషించబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఇంక హీరో విషయానికి వస్తే ఈ సినిమాలో హీరోగా సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్నారు అని అంటున్నారు. ఇప్పటివరకు రవితేజ నెగిటివ్ పాత్రలు పోషించింది తక్కువ.

దాంతో ఈ సినిమాలో ఇలాంటి పాత్ర పోషిస్తున్నారు అంటే కొంతమంది, “ఇలా చేయడం రిస్క్ ఏమో” అని అంటున్నారు. మరికొంతమంది మాత్రం, ర”వితేజ చాలా మంచి నటుడు. ఇలాంటి పాత్రలు చేస్తేనే రవితేజలోని నటుడు బయటికి వస్తాడు. కాబట్టి ఈ పాత్ర కచ్చితంగా రవితేజ కి ప్లస్ అవుతుంది” అని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే ఇంకా కొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం అయితే రవితేజ ధమాకా సినిమాతో పాటు టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కూడా నటిస్తున్నారు.


End of Article

You may also like