Ads
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆడియన్స్ ముందుకు ఈ ఇయర్ లో రెండో సారి ‘గాడ్ ఫాదర్’ తో వచ్చి ప్రేక్షకులను పలకరించారు. సమ్మర్ లో వచ్చిన ఆచార్య భారీ డిసాస్టర్ అయిన తర్వాత మలయాళ మూవీ లూసిఫర్ ను తెలుగు రీమేక్ గా గాడ్ ఫాదర్ చేసిన మెగాస్టార్…. దసరా కానుకగా సినిమాను బాక్స్ ఆఫీస్ బరిలోకి దించగా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై ఆర్బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు.
Video Advertisement
అయితే మాతృకతో పోలిస్తే కథనం లో చాలా మార్పులు చేసారు దర్శకుడు మోహన్ రాజా. దీంతో మంచి హిట్ గా నిలిచింది గాడ్ ఫాదర్. 2019 లో వచ్చిన “లూసిఫెర్” సినిమా కి రీమేక్ కి వచ్చిన “గాడ్ ఫాదర్” ఎక్కడా ఆ సినిమా తాలుకు మూల కథని దెబ్బ తియ్యకుండా కొత్త రకమైన స్క్రీప్లే ని జత చేసుకొని ప్రేక్షకులని రంజింపజేశారు దర్శకుడు మోహన్ రాజా. అలాగే చిరంజీవి తనదైన మార్క్ నటనతో సినిమాకి ఆయువుపట్టుగా నిలిచి ఎక్కడా ఇది రీమేక్ సినిమా అనే భావన రాకుండా చేయగలిగాడు.
అయితే ఒరిజినల్ తో పోలిస్తే ఈ మూవీలో చాలా మార్పులు చేశారు. అక్కడ సస్పెన్స్ అనుకున్న ఎలిమెంట్స్ అన్ని ఇక్కడ కొంచెం స్ట్రైట్ గా చెప్పే ప్రయత్నం చేశారు. ఒరిజినల్ లో హీరోకి తమ్ముడి పాత్ర ఒకటి ఉంటుంది. హీరోతో ఆ పాత్రకు కాంబినేషన్ సీన్స్ పెద్దగా ఉండవు కానీ ఆ పాత్ర ద్వారా హీరోకి ఓ మాస్ ఎలివేషన్ ఉంటుంది. ‘గాడ్ ఫాదర్’ లో అది మిస్ అయింది.
ఆ పాత్ర ఎందుకు తీసేసారు అని ఒక ఇంటర్వ్యూ లో మోహన్ రాజా ని ప్రశ్నించగా, ‘ఒరిజినల్ లో మోహన్ లాల్ పాత్ర 54 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఒరిజినల్ లో టోవినో థామస్ పాత్ర కొంచెం హీరో స్పేస్ ని ఆక్యుపై చేసినట్లు ఉంటుంది. అందుకే ఆ పాత్రను తీసేసి చెల్లెలి పాత్రకి అన్నయ్య పాత్రని కనెక్ట్ చేసి చిరంజీవి గారి స్క్రీన్ స్పేస్ పెంచాము. ఒరిజినల్ లో మోహన్ లాల్ 54 నిమిషాలు ఉంటారు. ఇక్కడ ఆ పాత్ర రెండు గంటల పైగా నిడివి వచ్చేలా చేసాం’ అంటూ దర్శకుడు మోహన్ రాజా చెప్పుకొచ్చారు.
అయితే లూసిఫెర్ చిత్రాన్ని రీమేక్ చెయ్యాలి అనుకున్నపుడు హీరో తమ్ముడి పాత్ర కోసం సత్య దేవ్ ను తీసుకున్నారట. కానీ గాడ్ ఫాదర్ లో ఆ పాత్ర ని కట్ చెయ్యడం తో పాటు కీలక రోల్ కి సత్యదేవ్ ని తీసుకున్నారు. గాడ్ ఫాదర్ లో చిరంజీవికి ధీటుగా నిలబడే పాత్రలో సత్యదేవ్ విమర్శకుల ప్రశంసలు పొందాడు.
End of Article