Ads
టాలీవుడ్ లో చాలానే ప్రముఖ నిర్మాణ సంస్థలు ఉన్నాయి. అందులో అశ్వినీ దత్ వైజయంతి మూవీస్ వారు భారీ బడ్జెట్ సినిమాలు తీస్తుంటారు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఫ్యామిలీ సినిమాలు తీస్తూ ఉంటారు. గీతా ఆర్ట్స్ వారు గ్లామరస్ సినిమాలు తీస్తుంటారు.
Video Advertisement
అయితే తాజాగా కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన “కాంతార” సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. కన్నడలో మాత్రమే కాక తెలుగులో కూడా ఈ సినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో ముందుకు దూసుకుపోతోంది. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాని విడుదల చేశారు. విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటూ మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా తెలుగులో చెప్పుకోదగ్గ కలెక్షన్లు సాధించి హాట్ టాపిక్ గా నిలిచింది.
కనీసం హీరో హీరోయిన్ దర్శకుడు ఎవరో కూడా తెలియకుండా సినిమా కోసం ప్రేక్షకులు క్యూ కట్టారు. కాగా కాంతార చిత్ర తెలుగు హక్కులను నిర్మాత అల్లు అరవింద్ కొన్నారు. ఈ క్రమంలో ఆయన భారీ ఎత్తున లాభాలు గడించనున్నారు.
కాంతార రైట్స్ కేవలం రూ. 2 కోట్లకు కొన్నట్లు సమాచారం. మొదటిరోజే ఈ మూవీ రూ. 2 కోట్ల షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్ రూ. 5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నాలుగు రోజులకు కలిపి ఎనిమిది కోట్ల పాతిక లక్షలు వసూలు చేసింది. మొత్తంగా 16 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు బయ్యర్లకు ఎనలేని లాభాలు తెచ్చిపెట్టింది.
నిజానికి ఈ సినిమాని కేవలం రెండు కోట్ల రూపాయలకు గీతా ఆర్ట్స్ సంస్థ బయ్యర్లకు విక్రయించింది. రెండు కోట్ల 30 లక్షలు వస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా ఫిక్స్ చేశారు. అయితే ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాక ఐదు కోట్ల 95 లక్షలు సాధించి లాభాల్లో పయనిస్తోంది. ఇక ఈ ఫిగర్ మరింత పెరిగి డబల్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. మొత్తంగా అల్లు అరవింద్ డబ్బింగ్ మూవీతో పెట్టుబడికి ఐదారు రెట్ల లాభం పొందనున్నారు.
ఇక కేవలం 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించిన కాంతార సినిమా ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే సుమారు 80 కోట్ల దాకా వసూళ్లు తీసుకువచ్చింది. ఇక ఇతర భాషలలో కూడా విడుదల చేయడంతో సినిమా 150 కోట్ల మార్కు దాటినా ఆశ్చర్యం లేదనే అంచనాలు ఉన్నాయి.
ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సంచలనాలు నమోదు చేస్తుంది. థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా కట్టిపడేస్తుంది. రిషబ్ శెట్టి రచించి దర్శకత్వం వహించి నటించారు. ముఖ్యంగా ఈ “కాంతార” క్లైమాక్స్ గురించి చెప్పాలంటే వర్ణనాతీతం. చివరి 20 నిమిషాలు అరాచకానికి అర్ధం చూపించాడు రిషబ్ శెట్టి.అప్పటివరకు మామూలుగా సాగుతున్న సినిమాను క్లైమాక్స్ లో వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు.థియేటర్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకునికి ఒళ్ళు గగుర్పుడిచేలా ఈ చిత్ర క్లైమాక్స్ ను మలిచాడు రిషబ్ శెట్టి.
End of Article