Ads
కన్నడ సినిమా కాంతారకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కన్నడ యంగ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించడమే కాకుండా దర్శకత్వం వహించిన కాంతార చిత్రం సెప్టెంబర్ 30న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. సామాన్యుడి నుంచి సెలబ్రటీల వరకు ఈ సినిమాని చూసిన వాళ్ళు కాంతార పై ప్రశంసల జల్లు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండడంతో ఈ మూవీ క్రేజ్ రోజు రోజుకీ పెరుతుంది.
Video Advertisement
ఇక వసూళ్ళ పరంగా చూసుకుంటే కాంతార ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 90 కోట్లు వసూళ్ళు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇదే ఊపులో ఈ వారం చివరికల్లా కాంతార మూవీ 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఒక్క కన్నడ రాష్ట్రంలోనే ఈ సినిమా దాదాపు 70 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందంటే, ఆ సినిమా రేంజ్ ఏంటో తెలుస్తుంది.
విడుదలైన అన్ని చోట్లా ఈ చిత్రం కలెక్షన్ల వర్షంకురిపిస్తోంది. ఇప్పటికే తెలుగులో పదిహేను కోట్ల గ్రాస్ వరకు చేరుకుంది. హిందీలో ఆల్రెడీ పది కోట్ల షేర్ రాబట్టేసింది. ఇలా అన్ని చోట్లా కాంతారా చిత్రం దూసుకుపోతోంది.
ఈ నేపథ్యంలోనే కాంతార మరో ఘనతనూ సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమా రేటింగ్స్ విషయంలో ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్)ది ప్రత్యేక స్థానం. ఏ సినిమాకి అయినా ఐఎండీబీలో పర్‌ఫెక్ట్ రేటింగ్ ఉంటుంది.
ఇప్పటి వకు కేజీఎఫ్2 మూవీ ఐఎండీబీ రేటింగ్స్‌లో టాప్‌లో ఉంది. ఐఎండీబీలో కేజీఎఫ్2 రేటింగ్ ఏ ఇప్పటివరకు అత్యధికం గా 8.4గా రికార్డు ఉంది. అయితే ఇప్పుడు కేజీఎఫ్2 రికార్డును కాంతార బ్రేక్ చేసి ఫస్ట్ ప్లేస్‌లోకి వెళ్ళింది. ఈ క్రమంలో ఐఎండీబీలో కాంతార 9.4 రేటింగ్ దక్కించుకున్న ఘనతను సాధించింది.
ఎస్.ఎస్.రాజమౌళి బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ కు ఐఎండీబీలో 8.0 రేటింగ్ ఉంది. అలా ఈ చిత్రాలన్నింటిని కాంతారా వెనక్కి నెట్టేసింది. మున్ముందు ఈ సినిమా కలెక్షన్లలో కూడా వెనక్కి నెట్టేసేలా కనిపిస్తోంది.
End of Article