Ads
మెగాస్టార్ చిరంజీవి నట వారసులుగా చాలామంది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. వారిలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ లు ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి పొజిషన్ లో ఉన్నారు. ఇక వీరిలో రామ్ చరణ్, అల్లు అర్జున్ స్టార్ హీరోలుగా ఎదిగిన సంగతి తెలిసిందే.
Video Advertisement
అయితే ఇండస్ట్రీలో ప్రస్తుతం సరికొత్త కాంబినేషన్స్ తెరపైకి రాబోతున్న విషయం తెలిసిందే. అయితే భవిష్యత్తులో మల్టీస్టారర్ సినిమాలు కూడా మరింతగా వచ్చే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది. ఇదివరకే దర్శకధీరుడు రాజమౌళి మెగా నందమూరి హీరోలతో కలిపి ఆర్ ఆర్ ఆర్ సినిమాతో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
అయితే మెగా హీరోలు రామ్ చరణ్ అల్లు అర్జున్ కూడా సినిమా చేసే అవకాశం ఉన్నట్లు నిర్మాత అల్లు అరవింద్ చెప్పకనే చెప్పేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
అల్లు అర్జున్, రామ్ చరణ్ ల మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ ఒకరి సినిమాకు మరొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. చరణ్ చాలా సందర్భాల్లో బన్నీ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. అదే విధంగా అల్లు అర్జున్ సైతం తనకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టమని తెలిపాడు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఎవడు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో ఓకే సమయంలో ఇద్దరూ స్క్రీన్ పై కనిపించలేదు. కానీ ఈ సినిమాలో ఇద్దరూ నటించారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. బన్ని- చరణ్ తో కలిసి ఒక సినిమా చేయాలని కోరిక ఉందని అన్నారు. అంతే కాకుండా పది సంవత్సరాల క్రితమే టైటిల్ ను కూడా రిజిష్టర్ చేసినట్టు చెప్పారు. “చరణ్ – అర్జున్” పేరుతో ఆ సినిమా టైటిల్ ని ఫిక్స్ చేసామని అన్నారు. ప్రతి సంవత్సరం ఆ టైటిల్ ను తాను రెన్యువల్ చేస్తున్నానని ఆయన తెలిపారు.
చిరంజీవి తనయుడిగా చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. అంతేకాకుండా చిరంజీవి, అల్లుడు నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఈ పదేళ్లలో వీరి స్టార్ స్టేటస్ మారిపోవడంతో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే చిత్రం భారీ మల్టీ స్టారర్ కాబోతుంది.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కాంబోకి కథ రాయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ పుణ్యమాని మెగా పవర్ స్టార్ ఇమేజ్ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిపోయింది. పుష్ప 1 వల్ల బన్నీ నార్త్ లోనూ మోస్ట్ పాపులర్ యాక్టర్ అయ్యాడు. కేరళ వరకే పరిమితమైన ఇతని మార్కెట్ ఇప్పుడు బాలీవుడ్ లోనూ అమాంతం పెరిగిపోయింది. ఈ ఇమేజ్ లను బ్యాలన్స్ చేయడం సులభం కాదు. అయితే సరైన కథ, దర్శకుడు ఎప్పటికి దొరుకుతాడో.. అల్లు అరవింద్ కల ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి..
End of Article