Ads
మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఎప్పుడు లేనంత స్పీడ్ గా వరుస సినిమాలు ప్రకటిస్తూ మెగా ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తున్నాడు.. మరో వైపు రానున్న సినిమాలో మాస్ మహారాజ్ రవితేజతో ఓ సినిమాలో తెరపంచుకోనుండటం ఆసక్తికరంగా మారింది. బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న కొత్త సినిమాలో రవితేజ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
Video Advertisement
2000 లో విడుదలైన “అన్నయ్య” సినిమాలో చిరంజీవి తమ్ముడి పాత్రలో కనిపించిన మాస్ మహారాజా రవితేజ 22 ఏళ్ళ తర్వాత మళ్ళీ చిరంజీవి సినిమాలో కనిపించబోతున్నారు. “ఆచార్య” సినిమాతో డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా “గాడ్ ఫాదర్” సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్నారు.
ఇప్పుడు చిరు కె ఎస్ రవీంద్ర అలియాస్ బాబి డైరెక్షన్లో “వాల్తేరు వీరయ్య” అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరు మరియు రవితేజ సవతి సోదరులుగా కనిపించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాలో చిరంజీవి ఒక దొంగ పాత్రలో కనిపించబోతుండగా రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్ర లో నటించనున్నారని కూడా టాక్ నడుస్తోంది.
తాజాగా ఈ సినిమాలో రవితేజ పాత్ర నిడివి గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కథను మలుపుతిప్పే కీలకమైన పాత్రలో రవితేజ పాత్ర ఉంటుందట. మొదటి హాఫ్ లో మాత్రమే కాక రెండవ హాఫ్ లో కూడా కనిపిస్తారట. అయితే రెండిట్లో కలిపి రవితేజకు ఈ సినిమాలో 45 నిమిషాల స్క్రీన్ టైం ఉండబోతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది. సంక్రాంతి కానుకగా 2023 జనవరి 11న భారీ స్థాయిలో విడుదల చెయ్యబోతున్నారు మేకర్స్.
End of Article