Ads
దక్షిణాది చిత్ర పరిశ్రమతోపాటు దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారి తీసిన చిత్రం ది లెజెండ్. తమిళనాడులో శరవణన్ గ్రూప్ అధినేత శరవణన్ అరుల్ హీరోగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజైంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందు సంపాదించుకొన్న క్రేజ్‌ను బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లుగా మలచలేకపోయింది.
Video Advertisement
50ఏళ్ల వయసులో హీరో అవ్వాలనే కలను నెరవేర్చుకున్నారు శరవణన్. ప్రముఖ వస్త్ర వ్యాపారం శరవణన్ స్టోర్స్ అధినేత అయిన శరవణన్ గతంలో తన బ్రాండ్ కు తానే యాడ్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ట్రోల్స్ బారిన కూడా పడ్డారు.
దాదాపు 60 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియన్ లెవల్లో.. లెజెండ్ సినిమాను తెరకెక్కించి అందర్నీ షాక్ చేశారు. షాక్ చేయడమే కాదు.. ఆ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్స్ ఇచ్చి మరీ స్టార్ టెక్నీషియన్లను తీసుకున్నారు. ఫైనల్ గా బెస్ట్ అవుట్ పుట్తో.. థియేటర్లలో రిలీజ్ చేసి.. అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా లాంటి టాప్ బ్యూటీని హీరోయిన్ గా తీసుకున్నారు.
అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్డేట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఓటీటీ ల హవా మొదలైన కాలం లో అన్ని చిత్రాలను కొన్ని రోజులు థియేటర్ లో వేసి తర్వాత లాభాలకు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ లకు అమ్మేసుకుంటున్నారు. ఈ నేపథ్యం లో తన ‘లెజెండ్’ సినిమాను ఏ ఓటీటీకి ఇచ్చేదుకు శరవణన్ ఆసక్తి చూపట్లేదని సమాచారం. దీనికి సంబంధించిన కారణాలు తెలియరాలేదు.
ఇప్పుడు రెండో సినిమాతో మరో సెన్సేషన్‌కు రెడీ అవుతున్నారు శరవణన్ అరుళ్. ఐదు పదుల వయసులో రొమాంటిక్ స్టార్ అనిపించుకునేందుకు తంటాలు పడుతున్నారు. త్వరలోనే ఓ యాక్షన్ రొమాంటిక్ కథతో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని తీసుకోనున్నారట. హీరోయిన్ గా ఓ బాలీవుడ్ టాప్ బ్యూటీని కూడా పరిశీలిస్తున్నారట.
End of Article