“ప్రభాస్” పుట్టిన రోజు మాములుగా ప్లాన్ చేయలేదుగా..? రాబోయే 4 సినిమాల అప్డేట్స్ ..?

“ప్రభాస్” పుట్టిన రోజు మాములుగా ప్లాన్ చేయలేదుగా..? రాబోయే 4 సినిమాల అప్డేట్స్ ..?

by Anudeep

Ads

బాహుబలితో ఒక్కసారిగా గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగారు నటుడు ప్రభాస్‌. ప్రస్తుతం ఈ యంగ్‌ రెబల్‌ స్టార్‌కు సంబంధించిన ఏ చిన్న వార్తైనా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారాల్సిందే. ప్రస్తుతం ప్రభాస్‌ ఒకేసారి ఏకంగా మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆదిపురుష్‌, కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తోన్న సలార్‌, నాగ్ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్‌ కే ఈ జాబితాలో ఉన్నాయి.

Video Advertisement

 

మూడు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమాల అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్‌ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందాలు అక్టోబర్‌ 23న ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

crazy updates on prabhas birthday..
ఆదిపురుష్‌ టీజర్‌ అభిమానులను నిరాశ పరిచిన నేపథ్యంలో అక్టోబర్‌ 23న ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో ట్రైలర్‌ లేదా పోస్టర్ ను విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఇక మరో సర్‌ప్రైజ్‌ సలార్‌ మూవీ రియల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రానుందని టాక్‌ నడుస్తోంది. మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ప్రాజెక్ట్ కే’ నుంచి కూడా అదిరిపోయే అప్డేట్ రానుంది. బర్త్ డే గిఫ్ట్ గా స్పెషల్ అప్డేట్ ను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా స్పిరిట్ మూవీ హీరోయిన్ గురించి కూడా ఒక అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్రేజీ బజ్ క్రియేట్ అవ్వడం తో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.


End of Article

You may also like