Ads
టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసి హిట్ దర్శకుడు అనిపించుకున్నాడు వంశి పైడిపల్లి. ఈయన దర్శకత్వం లో కోలీవుడ్ స్టార్ విజయ్ చేస్తున్న చిత్రం ‘ వారిసు’. తమిళంలో వంశి చేస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ‘దిల్’రాజు, శిరీష్, పరమ్ వి. పొట్లూరి, పెరల్ వి.పొట్లూరి నిర్మాతలు.
Video Advertisement
తాజాగా ఈ చిత్ర ప్రమోషన్ల సందర్భంగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు దర్శకుడు పైడిపల్లి వంశీ. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
” దిల్ రాజు గారు ఒకసారి నా దగ్గరకు వచ్చి.. ఒక కథ ఉంది విజయ్ కి చెప్దామా.. అని అడిగారు. ఒక్కసారి విజయ్ ని కలవొచ్చు అని చెన్నై కి వెళ్ళా.. ఒక గంట పాటు కథ చెప్పా. ఐపోయాక విజయ్ ఒక 30 సెకన్స్ సైలెంట్ గా ఉన్నారు. తర్వాత కథ బావుంది చేద్దాం అన్నారు. సంతోషం పట్టలేకపోయా..” అని చెప్పారు వంశి పైడిపల్లి.
“మహేష్ కి నాకు మహర్షి చిత్రం నుంచి పరిచయం పెరిగింది. అతడు నాకు ఒక సోదరుడు లాంటి వాడు. మా ఫామిలీస్ కూడా అలాగే కలిసిపోయాయి. నేను విజయ్ తో సినిమా చేస్తున్నా అని తెలిసి మహేష్ చాలా సంతోషించాడు” అని చెప్పుకొచ్చాడు వంశి.
ఇది పక్కా తమిళ చిత్రం అని వంశి పైడిపల్లి చెప్పారు. తెలుగులో డబ్బింగ్ వెర్షన్ విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. హీరోయిన్ రష్మిక తో విజయ్ కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది అని ఆయన చెప్పారు. ఇది ఫామిలీ ఎంటర్ టైనర్ అయిన విజయ్ ఫాన్స్ కి నచ్చేలా ఉంటుంది అని చెప్పారు వంశి పైడిపల్లి.
End of Article