Ads
ప్రస్తుతం అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ పాన్ ఇండియా చిత్రాల హవా నడుస్తోంది. సినిమా చిన్నదా.. పెద్దదా.. స్టార్ నటులున్నారా.. లేదా.. అన్న విషయాలు పక్కన పెట్టి.. సరైన కథ ఉంటే పాన్ ఇండియా లెవెల్లో చిత్రాలను తయారు చేస్తున్నారు మేకర్స్.
Video Advertisement
ఇకపోతే టాలీవుడ్ లో బాహుబలి చిత్రం తో ఈ సందడి మొదలైంది. అప్పటి నుంచి కథా బలమున్న చిత్రాలు దేశమంతటా రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యం లో త్వరలో పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న తెలుగు చిత్రాలేవో చూద్దాం..
#1 ఏజెంట్
సురేందర్ రెడ్డి దర్శకత్వం లో అఖిల్ అక్కినేని చేస్తున్న స్పై థ్రిల్లర్ ఏజెంట్. ఇందులో మమ్ముట్టి ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
#2 పుష్ప 2
సుకుమార్ దర్శకత్వం లో అల్లు అర్జున్ చేసిన పుష్ప : ది రిసె సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. దీని తర్వాతి పార్ట్ అయిన పుష్ప : ది రూల్ త్వరలో విడుదల కానుంది.
#3 యశోద
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన యశోద కూడా పాన్ ఇండియా చిత్రమే. దీనికి హరి-హరీష్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు.
#4 రాంచరణ్ 15
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కలయిక లో రాబోతున్న చిత్రం ఆర్సీ 15 . ఇది కూడా పాన్ ఇండియా చిత్రమే.
#5 ఎన్టీఆర్ 30
కొరటాల శివ దర్శకత్వం లో జూనియర్ ఎన్టీఆర్ చేయబోతున్న చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది.
#6 హరి హర వీరమల్లు
క్రిష్ దర్శకత్వం లో పవన్ చేస్తున్న చిత్రం హరి హర వీరమల్లు. దీనిలో కథానాయిక నిధి అగర్వాల్.
#7 దసరా
నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న చిత్రం దసరా. ఇది కూడా పాన్ ఇండియా చిత్రమే.
#8 శాకుంతలం
గుణశేఖర్ దర్శకత్వం లో సమంత ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం శాకుంతలం. దీని కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయనున్నారు.
#9 ప్రాజెక్ట్ కె
దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కె కూడా పాన్ ఇండియా చిత్రమే. ఇందులో ప్రభాస్, దీపికా పదుకొనె జంటగా నటిస్తున్నారు.
#10 రామ్- బోయపాటి చిత్రం
దర్శకుడు బోయపాటి శ్రీను, హీరో రామ్ తదుపరి చిత్రం కూడా పాన్ ఇండియా చిత్రమే అని సమాచారం.
#11 స్పై
హీరో నిఖిల్ సిద్దార్థ్ తదుపరి చిత్రం స్పై కూడా పాన్ ఇండియా చిత్రమే.
#12 మైకేల్
రంజిత్ జయకోడి దర్శకత్వంలో సందీప్ కిషన్ తో తెరకక్కుతున్న మైకేల్ చిత్రం పాన్ ఇండియా చిత్రమే.
#13 సలార్
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం ప్రభాస్ చేస్తున్న చిత్రం పాన్ ఇండియా చిత్రం సలార్.
End of Article