Ads
ఒక ఫార్ములా ఒక దగ్గర హిట్ అవ్వొచ్చు.. అదే ఫార్ములా మరో చోట ఫ్లాప్ కావచ్చు. ఒక చోట హిట్ అయిన సినిమాని మరో చోట రీమేక్ చేస్తే రిసల్ట్ వేరేలా రావొచ్చు. దీనికి కారణం ఆ టేకింగ్ అయినా కావొచ్చు లేదా .. అక్కడి వారికీ ఆ మూవీ టచ్ అయ్యి ఉండక పోవచ్చు. ఇలా కారణాలేమైనా దీన్ని ఈ దీపావళికి విడుదలైన రెండు సినిమాలు స్పష్టం చేశాయి.
Video Advertisement
విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘ఓరి దేవుడా’. తమిళ హిట్ ఫిల్మ్ ‘ఓ మై కడవులే’ ఆధారంగా ఈ మూవీని తెలుగులో రీమేక్ చేశారు. సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ కీలక అతిథి పాత్రలో దేవుడిగా నటించారు. ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకొని దూసుకు పోతోంది.
తమిళ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ కావడంతో తెలుగు రీమేక్ కూడా అదే స్థాయిలో హిట్ అవుతుందని అంతా భావించారు.తమిళ సినిమాని ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేసిన దర్శకుడు వెంకీ పాత్రతో కొంత మ్యాజిక్ చేశాడు.
అదే తెలుగులో ఈ రీమేక్ కు మరింత ప్లస్ గా మారి విజయాన్ని అందించింది. సినిమాకు ముందు నుంచి హైప్ లేకపోయినా.. ఎప్పుడైతే విక్టరీ వెంకటేష్ కీలక అతిథి పాత్రలో దేవుడిగా నటిస్తున్నాడని వీడియో రిలీజ్ చేశారో అప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల ఫోకస్ మొదలైంది.
ఇదిలా వుంటే ఇదే తరహాలో దేవుడు మనిషి మధ్య సాగే కథ నేపథ్యంలో హిందీ మూవీ ‘థాంక్ గాడ్’ రూపొందింది. కాకపోతే అక్కడ అజయ్ దేవగన్ చిత్ర గుప్తుడి పాత్రలో కనిపించారు. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటించగా ఈ మూవీని ఇంద్రకుమార్ తెరకెక్కించారు.
ధనవంతుడైన ఓ యువకుడు నోట్ల రద్దు కారణంగా తన ఆస్తి మొత్తాన్ని కోల్పోతాడు. ఆ తరువాత అతని జీవితం అత్యంత దయనీయంగా మారుతుంది. ఈ క్రమంలో వృత్తి పరంగా వ్యక్తిగతంగా చాలా ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటాడు. ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి యమ లోకానికి వెళతాడు.
అక్కడ చిత్రగుప్తుడు ఆ యువకుడు చేసి తప్పులని ఎత్తిచూపి తనని తాను మార్చుకునే అవకాశం ఇస్తాడు. ఈ నేఫథ్యంలో అతనితో గైమ్ ఆఫ్ లైఫ్’ అనే గేమ్ ని మొదలు పెడతాడు. ఆ తరువాత ఏం జరిగిందన్నపదే ఈ చిత్ర ప్రధాన కథ.
అయితే ఓరి దేవుడా చిత్రం లో కూడా ఇలాగే దేవుడు హీరో లో తప్పుల్ని చూపించి సరిదిద్దికొనేందుకు అవకాశం ఇస్తాడు. దీంతో ఆ చిత్రానికి ఓరి దేవుడా కి దగ్గరి పోలికలున్నా ట్రీట్మెంట్ విధానంలో చాలా మార్పులున్నాయి.
ఓరి దేవుడాలో ప్రతీ సీన్ భావోద్వేగభరితంగా నవ్వులు పూయిస్తూ సాగితే ‘థాంక్ గాడ్’లో మాత్రం ఏ ఒక్క సీన్ కూడా నేచురల్ గా లేకపోగా కృత్రిమంగా కనిపిస్తూ ప్రేక్షకుడిని ఎట్రాక్ట్ చేయడంలో విఫలమైంది. దీంతో ఒకటే ఫార్ములా అయినా తీసే విధానం లో మార్పుల వాళ్ళ రెండు చిత్రాలకు రెండు రకాల ఫలితాలు వచ్చాయి.
End of Article