Ads
తెలుగు సినీ ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విశ్వ నటుడు కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది. అంతేకాకుండా టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Video Advertisement
ఇకపోతే కెరీర్ పరంగా దాదాపు మూడేళ్ళ గ్యాప్ తీసుకున్న శృతి హాసన్.. రీసెంట్‌గా వచ్చిన ”క్రాక్, వకీల్ సాబ్” సినిమాలతో తిరిగి ట్రాక్ ఎక్కింది. స్టార్ హీరోలకు బెటర్ చాయిస్ అవుతూ వరుస సినిమాలకు కమిటవుతోంది. ప్రస్తుతం ఈమె చేతినిండా వరుస పాజెక్టులతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలకృష్ణ సరసన వీర సింహారెడ్డి సినిమాలో నటిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య లో కూడా శృతి నే హీరోయిన్.
తాజాగా దీపావళి సందర్భంగా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల టీజర్లు విడుదలయ్యాయి. అయితే ఈ రెండు టీజర్లలో శృతి హాసన్ కొన్ని సెకన్ల పాటు కూడా కనిపించలేదు. దీంతో శృతి హాసన్ అభిమానులు తెగ ఫీలవుతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలలో శృతి హాసన్ పాత్రలకు ప్రాధాన్యత ఉందా? లేదా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటివరకు ఈ సినిమాల నుంచి శృతి హాసన్ కు సంబంధించిన పోస్టర్లు కూడా రిలీజ్ కాకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. హీరోయిన్ శృతి హాసన్ కు అన్యాయం జరిగిందని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
End of Article