Ads
చిత్ర పరిశ్రమలో చేసిన సినిమాలకంటే.. ఎన్ని మంచి సినిమాలు మన నుంచి వచ్చాయి అనేదే ముఖ్యం అంటుంది నిత్యా మీనన్. అలా మొదలైంది చిత్రంతో కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేటి వరకు ఆమె అదే మాట మీద ఉంది. ఎంతో ఆలోచించి కానీ ఆమె ప్రాజెక్టులు ఎంచుకోదు.
Video Advertisement
చైల్డ్ ఆర్టిస్టుగానే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. అన్ని భాషాల చిత్రాల్లో నటిస్తూ దక్షిణాదిలోని సినీ ప్రియులను అలరిస్తూనే ఉంది. కేరీర్ పరంగా తనకు నచ్చిన సినిమాలు, ప్రాధాన్యత ఉన్న పాత్రలనే పోషిస్తూ వస్తోంది. బలమైన పాత్ర అయితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అయితే సినిమాల పరంగా ఈ మధ్య కొంత వెనుకబడిన నిత్యా.. సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
పాజిటివ్ రిజల్ట్ చూపిస్తున్న ప్రెగ్నెన్సీ కిట్స్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ‘వండర్ బిగిన్స్’ అని రాశారు నిత్య. దాంతో నెటిజన్స్ కన్‌ఫ్యూజ్ అయ్యారు. కొందరైతే షాకయ్యారు. ఇంకొందరు తేరుకుని కంగ్రాట్స్ కూడా చెప్పేశారు.
అయితే మలయాళ నటి పార్వతి కూడా ఇలాంటి పోస్ట్ పెట్టడంతో ఇది వారిద్దరూ చేస్తున్న సినిమా ప్రమోషన్ అని తెలుస్తోంది. అదే.. ‘వండర్ ఉమెన్’ చిత్రం.
అంజలీ మీనన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ప్రెగ్నెంట్ లేడీస్ చుట్టూ తిరుగుతుంది. అందుకే ఇలా ప్రకటించారు. గతంలో అంజలి, నిత్య, పార్వతి కలిసి ‘బెంగళూర్ డేస్’ చిత్రానికి పని చేశారు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
End of Article