Home gossips ఆహా షో కోసం “సుడిగాలి సుధీర్” అన్ని లక్షలు తీసుకుంటున్నారా..?

ఆహా షో కోసం “సుడిగాలి సుధీర్” అన్ని లక్షలు తీసుకుంటున్నారా..?

by Anudeep

ఆహా.. తెలుగు సినీ ప్రియులకు ఎప్పటికప్పుడు అన్ లిమిటెడ్ వినోదాన్ని అందిస్తూ డిజిటల్ రంగంలో దూసుకుపోతుంది. టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాలనే కాకుండా.. ఇతర భాషల్లో భారీ విజయాన్ని అందుకున్న చిత్రాలను డబ్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకువస్తుంది. అలాగే గేమ్ షోస్, టాక్ షోస్, కుకింగ్ సోష్ అంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది.

అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోతో యాంకర్‏గా నందమూరి బాలకృష్ణలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన ఆహా.. ఇప్పుడు సరికొత్త షోను లాంచ్ చేస్తుంది. కామెడీ స్టాక్ ఎక్సేంజ్ పేరుతో మరో షోను స్టార్ట్ చేస్తుంది.

sudigali sudheer remunaration for aha show..
అయితే జబర్దస్త్ ద్వారా మంచి ట్రాక్ లోకి వచ్చిన సుడిగాలి సుదీర్ ఒకవైపు జబర్దస్త్ చేస్తూనే మరొకవైపు సినిమాల్లో కూడా నటించాడు. అలాగే ఈటీవీలోని మరికొన్ని కామెడీ షోలలో కూడా చేసాడు. అయితే సుడిగాలి సుదీర్ హఠాత్తుగా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసినప్పటినుంచి అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. అలాగే ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కూడా బయటకు రావడంతో పలు విభేదాలు వచ్చినట్లు కూడా ఎన్నో కథనాలు సోషల్ మీడియాలో వినిపించాయి.

sudigali sudheer remunaration for aha show..

ఈ తరుణంలోనే ఆహా కామెడీ స్టాక్ ఎక్స్ చేంజ్ అనే షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సుధీర్. దీంతో ఓటీటీ లో అడుగుపెడుతున్నారు సుధీర్. స్టాండప్ కామెడీ షో గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ షోలో అనిల్ రావిపూడి కూడా ప్రత్యేక జడ్జిగా కనిపించబోతున్నాడు. సుధీర్ తో పాటు ప్రముఖ కమెడియన్లు కూడా ఈ షోలో కనిపించనున్నారని తెలుస్తోంది.

sudigali sudheer remunaration for aha show..

ఆహా కామెడీ షోలో చేయడానికి సుధీర్ కు భారీగా రెమ్యునరేషన్ ఇచ్చినట్లు టాక్. ఒకప్పుడు జబర్దస్త్ ద్వారా సుధీర్ ఒక ఎపిసోడ్ కు దాదాపు రెండు లక్షలు తీసుకుంటూ వచ్చాడు. ఇక ఇప్పుడు ఆహా కామెడీ స్టార్స్ కోసం అతను అంతకంటే ఎక్కువ స్థాయిలోనే మూడు లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. షో మరింత క్లిక్ అయినా కూడా అతని రేంజ్ పేరుగుతుంది. మరి ఈ షో ద్వారా ఎలాంటి లాభాలను అందుకుంటాడో చూడాలి.

sudigali sudheer remunaration for aha show..

సుడిగాలి సుధీర్ ఇప్పటివరకు నటించిన సినిమాలలో ఏ సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. చివరగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో సుధీర్ పండుగాడు అనే సినిమా చేశాడు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయింది. ఇక ప్రస్తుతం సుధీర్ లిస్టులో రెండు మూడు సినిమాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. కానీ అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనే విషయంలో క్లారిటీ లేదు.

You may also like