హన్సిక పెళ్లి చేసుకోబోతున్న అతని బాక్గ్రౌండ్ ఏంటో తెలుసా..?

హన్సిక పెళ్లి చేసుకోబోతున్న అతని బాక్గ్రౌండ్ ఏంటో తెలుసా..?

by Anudeep

Ads

గత కొన్నిరోజులుగా యాపిల్ బ్యూటీ హన్సిక పెళ్లి పై చాలా వార్తలు వస్తున్నాయి. అయితే ఒక ఇంటర్వ్యూ లో వాటిపై స్పందిస్తూ డిసెంబర్ లో తన పెళ్లి అంటూ ఒక క్లారిటీ ఇచ్చేసింది హన్సిక. అయితే తాజాగా తనకు కాబోయే భర్త ఫోటోలను సోషల్ మీడియా లో పంచుకుంది ఈ భామ. దీంతో ఒక్కసారిగా ఆ ఫోటోలు వైరల్ అయిపోయాయి.

Video Advertisement

 

బాలనటిగా హిందీ లో మొదటిగా అడుగు పెట్టిన హన్సిక హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. బన్నీ సరసన హీరోయిన్‌గా నటించిన ఈ ముద్దుగుమ్మ… తన క్యూ యాక్టింగ్‌తో అందర్నీ కట్టి పడేసింది.గత రెండేళ్లుగా సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన హన్సిక మళ్ళీ తిరిగి వరుస ప్రాజెక్టులతో బిజీగా మారింది.

heroine hansika revealed her fiance photos..
గత కొన్నిరోజులుగా హన్సిక పెళ్లి చేసుకుంటుందని వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలన్నింటిని నిజం చేస్తే.. తాను పెళ్లి చేసుకోబోయే వాడి ఫోటోలను దేశముదురు బ్యూటీ షేర్ చేసింది.ఈఫిల్ టవర్ వద్ద తనకు కాబోయే భర్త… పెళ్లి కోసం ప్రపోజ్ చేస్తున్నపిక్స్‌ను హన్సిక అభిమానులతో పంచుకుంది.

heroine hansika revealed her fiance photos..
ఇకపోతే హన్సిక పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు సోహైల్ కతూరియా. ఇతడు ముంబై కి చెందిన వ్యాపారవేత్త. అవంతే టెక్స్ వరల్డ్ అనే టెక్స్టైల్ కంపెనీ కి సోహైల్ యజమాని. కాగా హన్సిక కాబోయే భర్త బిజినెస్ స్ట్రాటజీస్లో మంచి గ్రిప్ ఉన్న మనిషి అని.. వ్యాపారంలో నెంబర్ వన్ మైండ్ సెట్ ఉన్న బిజినెస్ మ్యాన్ అని తెలుస్తుంది. దాదాపు ఏడు సంవత్సరాలుగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరు కలసి బిజినెస్‌ను ప్రారంభించారు. ఆ సమయంలో వీరి ఆలోచనలు, అభిరుచులు కలిశాయి. అప్పటి నుంచి ప్రేమించుకోవడం మొదలుపెట్టారు. తాజాగా పెళ్లి చేసుకొబోతున్నారు.

heroine hansika revealed her fiance photos..
మరోవైపు అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 4న వివాహం జరగనుందని తెలుస్తుంది. వివాహానికి జైపూర్‌లోని 450 ఏళ్ల నాటి రాజకోట అయినటువంటి ముందోట పోర్ట్ ప్యాలెస్ వేదికగా మారనుంది. వేడుకకు వచ్చే అతిథుల కోసం హోటల్‌లోని అన్ని గదులు, సూట్స్‌ను బుక్ చేశారు. పెళ్లి పనులు డిసెంబర్ 2 నుంచి ప్రారంభం అవుతాయి. డిసెంబర్ 3 న మెహందీ, సంగీత్, డిసెంబర్ 4న వివాహం జరగనుంది. అతిథులు, సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరు కానున్నారు.


End of Article

You may also like