Ads
- చిత్రం : లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్
- నటీనటులు : సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా,సుదర్శన్
- నిర్మాత : వెంకట్ బోయినపల్లి (ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్)
- దర్శకత్వం : మేర్లపాక గాంధీ
- సంగీతం : ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిరియాల
- విడుదల తేదీ : నవంబర్ 04, 2022
Video Advertisement
Like, Share & Subscribe Review Story స్టోరీ :
హీరో విప్లవ్ (సంతోష్ శోభన్ ), హీరోయిన్ వసుధ (ఫారియా అబ్దుల్లా) ఇద్దరు యూట్యూబర్స్. సోషల్ మీడియా పిచ్చితో ఏ పని చేసినా.. లైక్ ల కోసం.. తమ వీడియోలు వైరల్ అవ్వాలని చేస్తుంటారు. అటువంటి వారి జీవితంలో జరిగిన సీరియస్ సంఘటనల సమాహారమే ఈ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ సినిమా.
Like, Share & Subscribe Review in Telugu
రివ్యూ :
యువ హీరో సంతోష్ శోభన్, జాతిరత్నాలు భామ ఫరియా అబ్దుల్లా జంటగా నటించడంతో ఈ చిత్రం పై అంచనాలు పెరిగాయి. అయితే ట్యాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ మరో కొత్త ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకి రాగా ఇది అంతగా ఆకట్టుకోలేదు. మేర్లపాక గాంధీ అంతకుముందు ఎక్స్ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం సినిమాలకి దర్శకత్వం వహించారు. ఎక్స్ప్రెస్ రాజా హిట్ గా నిలువగా, కృష్ణార్జున యుద్ధం ఒక ప్రయోగాత్మక సినిమా అనే గుర్తింపు సంపాదించుకుంది. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే
ట్రైలర్స్, టీజర్ లో చూపించినంతగా కామెడీ వర్క్ అవుట్ అవ్వలేదు . ఫస్ట్ హాఫ్ లో కామెడీ అక్కడక్కడా మాత్రమే వర్క్ అయింది. మిగిలిన కామెడీ డైలాగ్స్ సిల్లీగా అనిపిస్తాయి.
ఏదైనా ట్రావెల్ వీడియో రన్ అవుతోందా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఇంటర్వెల్ బ్లాక్ కూడా గొప్పగా ఏమీ ఉండదు. దీనితో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ గా తేలిపోయింది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే కిడ్నాప్ డ్రామా, కామెడీ ఏమాత్రం వర్కౌట్ కాలేదు. రామ్ మిర్యాల పాడిన ‘లచ్చుమమ్మ’ సాంగ్ సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ కి బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ఆ పాట చిత్రీకణ బాగా ఆకట్టుకుంటుంది. నటన పరంగా మాత్రం సంతోష్ శోభన్ వేరియేషన్స్ అద్భుతంగా చూపించాడు. ఫరియా అబ్దుల్లా నటన కూడా పాత్రకి తగ్గట్టుగా ఉంది. అలాగే మిగిలిన పాత్రల్లో నటించిన బ్రహ్మాజీ, సుదర్శన్ కూడా తెరపై కామెడీ పండించటానికి తమ వంతు ప్రయత్నం చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
- లచ్చువమ్మో సాంగ్
- హీరో నటన
- కొన్ని కామెడీ సీన్లు
మైనస్ పాయింట్స్:
- స్టోరీ
- స్క్రీన్ ప్లే
రేటింగ్ :
1.5 /5
ట్యాగ్ లైన్ :
డిస్ లైక్ అండ్ డోంట్ సబ్‌స్క్రైబ్
watch trailer :
Also Read: బియ్యం, పప్పులు కల్తీ అయ్యాయా లేదా అనేది.. ఇలా టెస్ట్ చెయ్యండి..!
End of Article