ఎన్టీఆర్ దగ్గర ఉన్న 9 ఖరీదైన వస్తువులు..!

ఎన్టీఆర్ దగ్గర ఉన్న 9 ఖరీదైన వస్తువులు..!

by Anudeep

Ads

టాలీవుడ్​ టాప్​ హీరోల్లో జూనియర్​ ఎన్టీఆర్​ ఒకరు. ‘ఆర్​ఆర్​ఆర్’​ సినిమా సక్సెస్​తో పాన్​ ఇండియా స్టార్​గా మారిపోయారు తారక్​. భారీ బడ్జెట్​తో తీసే..

Video Advertisement

ఎన్టీఆర్​ సినిమాలు ఎంత రిచ్​గా ఉంటాయో.. ఆయన పర్సనల్​ లైఫ్​ అంతకు మించి లగ్జరీగా ఉంటుంది.. కార్ల కలెక్షన్​, పర్సనల్​ జెట్​, రూ.కోట్లు విలువ చేసే వాచ్​.. ఇలా ఆయన వద్ద ఉన్న.. కొన్ని ఖరీదైన వస్తువులు ఏవో చూద్దాం..

expensive things owned by junior NTR

#1 బంగ్లా – 60 కోట్లు
జూబ్లీహిల్స్ లో ప్రస్తుతం ఎన్టీఆర్ నివసిస్తున్న ఇంటి విలువ సుమారు 60 కోట్లు. సకల సౌకర్యాలతో విలాసవంతంగా ఆ ఇంటిని నిర్మించుకున్నారు తారక్.

expensive things owned by junior NTR

#2 లంబోర్ఘిని ఉర్స్ గ్రాఫైట్ క్యాప్సూల్ – మూడున్నర కోట్లు
ఎన్టీఆర్ దగ్గరున్న కార్లలో అత్యంత విలువైనది లంబోర్ఘిని ఉర్స్ కార్. బులెట్ ప్రూఫ్ అయినా ఈ కార్ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.

expensive things owned by junior NTR

#3 రిచర్డ్ మిల్లే ఎఫ్​-1 లిమిటెడ్​ ఎడిషన్
ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన వాచ్‌లలో ఒకటైన ‘రిచర్డ్ మిల్లే ఎఫ్​-1 లిమిటెడ్​ ఎడిషన్​’ ఎన్టీఆర్​ దగ్గర ఉంది. దీని ధర అక్షరాల రూ. 4కోట్లు. ఆర్​ఆర్​ఆర్​ ప్రమోషన్స్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ వాచ్​ పెట్టుకొని కనిపించారు.

expensive things owned by junior NTR

#4 ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్
లగ్జరీ కారు అయిన ‘ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ ‘ జూనియర్​ ఎన్టీఆర్​ గ్యారేజీలో ఉంటుంది. ఎస్​యూవీ శ్రేణికి చెందిన ఈ వాహనం ధర రూ. 2.26 కోట్లు.

expensive things owned by junior NTR
#5 బి ఎం డబ్ల్యు 720 ఎల్డి
ఎన్టీఆర్ వద్ద 1 .32 కోట్ల విలువైన బి ఎం డబ్ల్యు 720 ఎల్డి కార్ ఉంది.

expensive things owned by junior NTR
#6 పోర్ష్ 718 కేమన్
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ‘పోర్ష్ 718 కేమన్’ వాహనం తారక్​ వద్ద ఉంది. దీని ఖరీదు రూ.1.22కోట్లు.

expensive things owned by junior NTR
#7 మెర్సిడేస్ బెంజ్ జీఎల్​ఎస్​ 350డీ
జూనియర్​ ఎన్టీఆర్​ గ్యారేజీలో ‘మెర్సిడేస్ బెంజ్ జీఎల్​ఎస్​ 350డీ’ వాహనం కూడా ఉంది. దీని ధర రూ.88.18లక్షలు.

expensive things owned by junior NTR
#8 ప్రైవేట్ జెట్
ఎన్టీఆర్​ దగ్గర ఉన్నవాటిలో అత్యంత ఖరీదైనది ప్రైవేట్ జెట్. ఈ జెట్​ను రూ.80కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారట జూనియర్​ ఎన్టీఆర్​. దీన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్క్ చేస్తున్నట్లు సమాచారం. అప్పుడప్పుడు ఈ జెట్​లో ఫ్యామిలీ టూర్స్​కు కూడా వెళ్తుంటారు జూనియర్​.

expensive things owned by junior NTR
#9 హాయాబూసా
సుజుకీ.. తీసుకొచ్చిన సూపర్ మోటర్ సైకిల్ మోడల్​ ‘హాయాబూసా’. 1340 సీసీ సామర్థ్యం ఉన్న ఈ బైక్​ జూనియర్​ ఎన్టీఆర్​ వద్ద ఉంది. దీని ధర రూ.16లక్షలు.

expensive things owned by junior NTR

 


End of Article

You may also like