Ads
గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్నను నేషనల్ క్రష్ గా అభిమానులు ఎంతో అభిమానంగా పిలుచు కుంటారు. ఆమె పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ క్రేజ్ తో పలు బాలీవుడ్ చిత్రాలకు కూడా సైన్ చేసింది రష్మిక. ప్రెజెంట్ ఈమె అన్ని ఇండస్ట్రీలలో వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.
Video Advertisement
అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈమెపై గత కొన్ని రోజుల నుండి చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఈమె పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటుంది. ఇప్పుడు మాత్రం ట్రోల్ల్స్ పై స్పందిస్తూ ఎమోషనల్ అయింది రష్మిక.
” గత కొంత కాలంగా కొన్ని ట్రోల్స్ నన్ను బాధపెడుతూనే ఉన్నాయి.. ఇప్పుడు నేను వాటిపై మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇది ఇంతకు ముందే ఎప్పుడో చేయాల్సింది. కానీ ఇప్పుడు చెబుతున్నాను.. నా కెరీర్ స్టార్ట్ చేసిన క్షణం నుంచి నెగెటివిటీ వస్తూనే ఉంది.. మామూలుగానే ట్రోల్స్, నెగెటివిటీ అనేది కామన్‌గా వస్తూ ఉంటాయి.
నేను ఎంచుకున్న కెరీర్ అలాంటిదే అని నాకు తెలుసు.. పైగా నేను అందరికీ నచ్చాలని రూల్ ఏమీ లేదు.. అందరి ప్రేమ నాకు దక్కాలని కూడా అనుకోను..మీకు నేను నచ్చలేదని అంటే..ఇలా నెగెటివిటీ, ట్రోలింగ్ చేయడం కాదు కదా?
నేను చెప్పని విషయాలను చెప్పినట్టుగా సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో ప్రచారం చేయడం మాత్రం నాకు చాలా బాధగా అనిపిస్తోంది. అవి నన్ను తక్కువ చేసినట్టుగా అనిపిస్తోంది. నేను ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని విషయాలు తప్పుగా వెళ్లిపోయాయి. నేను చెప్పింది కాకుండా వేరేవి రాస్తున్నారు.. దాని వల్ల నాకు ఇండస్ట్రీలో ఉన్న రిలేషన్స్, బయట ఉన్న రిలేషన్స్ దెబ్బ తినే అవకాశాలున్నాయి. మంచి విమర్శల వల్ల నా కెరీర్ ముందుకు వెళ్తుంది.. తప్పులను మార్చుకోవడానికి పని చేస్తాయి.. కానీ ఇలాంటి హేట్, నెగెటివిటీ ఎందుకు?.. ఇన్నేళ్లుగా దాన్ని పట్టించుకోవద్దని అనుకున్నాను.. కానీ అది మరింత హద్దులు దాటుతోంది.. ఇప్పుడు ఇలా బయటకు చెబుతున్నాను.
మీలో కొందరు నాపై చూపిస్తున్న ప్రేమకు రుణపడిపోయాను. వారి ప్రేమే ఎల్లప్పుడు నన్ను మరింత ముందుకు నడిపిస్తుంది. ఆ ప్రేమే ఇప్పుడు ఇలా నా మనసులోని మాటలను చెప్పేందుకు దైర్యాన్ని ఇచ్చింది. నా చుట్టూ ఉండే వారు నన్ను ప్రేమిస్తున్నారు. మిమ్మల్ని అలరించేందుకు మరింత కష్టపడతాను. అందరి పట్ల కాస్త దయతో మెలగండి.. మేం మా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటాం. థాంక్యూ’ అంటూ రష్మిక మందన ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
End of Article