మీ అందరికి సినిమా నచ్చాలి అని కోరుకుంటున్నా..! “సమంత” ఎమోషనల్ పోస్ట్..!

మీ అందరికి సినిమా నచ్చాలి అని కోరుకుంటున్నా..! “సమంత” ఎమోషనల్ పోస్ట్..!

by Anudeep

Ads

చాలా గ్యాప్ తర్వాత సమంత ఫుల్ లెంగ్త్ సినిమాతో రాబోతుంది. ‘యశోద’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. తమిళ డైరెక్టర్స్ హరి-హరీష్ దర్శకత్వంలో సమంత మెయిన్ లీడ్ లో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ యశోద సినిమాని తెరకెక్కించారు. యశోద సినిమా పాన్ ఇండియా వైడ్ నవంబర్ 11న విడుదల కానుంది.

Video Advertisement

 

ఇటీవల తన అనారోగ్యం గురించి ప్రకటించిన సమంత కూడా యశోద ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది. ఇందులో భాగంగా ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింది. తాజాగా యశోద సినిమాపై స్పెషల్ ట్వీట్ చేసింది సమంత.

samantha post about yashoda release..

తన ఫోటో ఒకటి షేర్ చేసి.. ”చాలా భయంగా, ఆతృతగా ఉంది. యశోద రిలీజ్ అవ్వడానికి ఒక్క రోజే సమయం ఉంది. మీ అందరికి యశోద నచ్చుతుందని ఆశిస్తున్నాను. మా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, చిత్ర యూనిట్ అందరికి మంచి జరుగుతుంది. అందరం రేపు మీరిచ్చే ఫలితం కోసం ఎదురుచూస్తున్నాం.” అని పోస్ట్ చేసింది. దీంతో సమంత చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

samantha post about yashoda release..

ఈ మూవీ.. సమంత ఇంతకు ముందు చేసిన ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌కు డిఫరెంట్ అని చెప్పాలి. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా ఉంది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్‌తో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు.

samantha post about yashoda release..

ఈ యాక్షన్ థ్రిల్లర్‌‌లో సమంతతో పాటు ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్‌కుమార్, రావు రమేష్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.


End of Article

You may also like