Ads
సిద్దార్థ్ రాయ్.. ఈ పేరు వినగానే ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు. సిద్దూ .. సిద్దార్థ్ రాయ్… అంటూ తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకొనే విధానం ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేదు. అటువంటి పేరునే టైటిల్ గా రిజిస్టర్ చేయించాడు డైరెక్టర్ హరీష్ శంకర్.
Video Advertisement
తాజాగా మైత్రీ మూవీస్ లో `సిద్దార్థ్ రాయ్` అనే పేరు రిజిస్టర్ చేయించాడు హరీష్. ఈ పేరు పవన్ కి తప్ప ఇంకెవ్వరికీ సూట్ అవ్వదు. మరి పవన్‌తో ఈ సినిమా హరీష్ చేయగలడా.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేసేందుకు కమిట్ అయిన హరీశ్ శంకర్ ఆయన డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ తన సినిమాలతో పాటు రాజకీయంగా ఫుల్ బిజీ అయ్యారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియని పరిస్థితి.
భవదీయుడు భగత్ సింగ్ కథపై హరీష్ చాలా నమ్మకం పెట్టుకొన్నాడు. ఈ కథ పవన్ కి తప్ప ఇంకెవ్వరికీ సూట్ అవ్వదు కూడా. సో.. ఈ సినిమా ఇప్పుడు ఆలస్యం అవ్వొచ్చు. కానీ ఎప్పటికైనా పవన్‌తోనే ఉంటుంది. ఈ విషయంలో ఎవరికీ అనుమానాల్లేవు. మరి పవన్‌కి మాత్రమే సూటయ్యే.. సిద్దార్థ్ రాయ్ టైటిల్ని హరీష్ ఎప్పుడు వాడుకొంటాడో.. అసలు ఎవరితో తీస్తాడో చూడాలి.
End of Article