Ads
ఓ మూవీ సక్సెస్ అవ్వాలి అంటే హీరో , హీరోయిన్ల తో పాటుకథ, కాస్టింగ్, బడ్జెట్, సంగీతం వంటి ఎన్నో అంశాలు సరిగ్గా సెట్ అవ్వాలి. అప్పుడే ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతుంది. తమ కెరియర్ లో ఒక్క సూపర్ డూపర్ హిట్ పడితే చాలు ఆ తరువాత తిరుగు ఉండదు అని ఎందరో తారలు భావిస్తారు. కానీ పాపం కొన్నిసార్లు కొంతమందికి ఇట్లాంటి హిట్ లు కూడా ప్రమాదకరంగా మారుతాయి.
Video Advertisement
ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ తరువాత జనాల్లో ఆ యాక్టర్ మీద అంచనాలు విపరీతంగా ఏర్పడతాయి. వాళ్లు నటించే తర్వాత చిత్రాలలో కూడా హిట్ అయిన సినిమా ఒక్క ఇంపాక్ట్ ఎంతో ఉంటుంది. హిట్ సినిమా తర్వాత వచ్చిన ప్రతి సినిమాని పాత సినిమాతో పోల్చి అదే రేంజ్ హిట్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు.
ఒకవేళ వాళ్ళు ఆశించినట్లు ఆ మూవీ లేకపోతే మాత్రం ఆ యాక్టర్ పని ఇంక అంతే. దాంతో కొన్నిసార్లు భారీగా విజయం పొందిన సినిమాలు యాక్టర్స్ కెరియర్ లో పీడకలగా మిగిలిపోతాయి. అలా ఏళ్లకు ఏళ్లు హిట్ దొరకక ఇబ్బంది పడిన ఆ స్టార్ నటీనటులు ఎవరో చూద్దాం.
#1 కీర్తి సురేష్
మహానటి చిత్రం తరువాత నిజంగా మహానటి గా గుర్తింపు పొందిన యాక్టర్ కీర్తి సురేష్. ఈ చిత్రం తర్వాత దాదాపు నాలుగు సంవత్సరాల వరకు కీర్తి సురేష్ మహానటి సక్సెస్ నీడ నుంచి తప్పించుకోలేక పోయింది. మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన సర్కారు వారి పాటతో ఆమెకు మహానటి తరువాత తిరిగి హిట్ చిత్రం దొరికింది. ఈ గ్యాప్ లో ఇంచుమించు తొమ్మిది సినిమాలు నటించినప్పటికీ అందులో ఒక్క హిట్ కూడా రాలేదు.
#2 కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ ఆ రోజుల్లో అల్లూరి సీతారామరాజు గా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. నిజంగా అల్లూరి ఇలా ఉంటాడా అని ఫ్యాన్స్ ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అలాంటి కృష్ణ తిరిగి అల్లూరి లాంటి సినిమా తీయలేక ఎన్నో ఫ్లాపులు చవి చూశాడు. అలా ఇంచుమించు తిరిగి హిట్ సంపాదించడానికి ఆయనకు ఎనిమిది సంవత్సరాల సమయం పట్టింది.
#3 రానా
బాహుబలి తరువాత పాన్ ఇండియా రేంజ్ లో మంచి పాపులారిటీ సంపాదించాడు దగ్గుపాటి రానా. కానీ ఈ పాపిలారిటీ ఒక విలన్ క్యాడర్ లో వచ్చింది కాబట్టి ఇప్పుడు అతను తిరిగి హీరోగా నటిస్తే ప్రేక్షకులకు రంజుగా లేదు. ఈ మధ్య రిలీజ్ అయిన అరణ్య, విరాట పర్వం లాంటి చిత్రాలలో రానా హీరోగా అద్భుతంగా నటించినప్పటికీ ప్రేక్షకులు దాన్ని స్వీకరించలేకపోయారు.
#4 ప్రభాస్
బాహుబలి 1 తో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రభాస్ తిరిగి బాహుబలి 2 లో దేశాన్ని కాదు మొత్తం ప్రపంచాన్ని ఒక ఊపు ఊపాడు. కానీ ఆ తరువాత తీసిన సాహూ, రాధే శ్యామ్ వంటి సినిమాలను ప్రేక్షకులు బాహుబలి తో పోల్చి చూడడం వల్ల అవి బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలబడ్డాయి. మరి రానున్న సినిమాల పైన కూడా బాహుబలి ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందో ప్రశ్నార్థకమే. ఇటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో రానున్న ప్రభాస్ చిత్రాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
End of Article