Ads
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నాచురల్ స్టార్ నాని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.మంచి మంచి కంటెంట్ లు సినిమాలలో నటించి స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. ఇక ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బాగా దూసుకుపోతున్నాడు. అంతేకాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టి పలు సినిమాలు చేశాడు.
Video Advertisement
అయితే తాజాగా నాని చేసిన ఒక ట్వీట్ అందర్నీ షాక్ కి గురిచేసింది. నాని ప్రారంభించిన ‘వాల్ పోస్టర్ సినిమాస్’ బ్యానర్‌పై తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్ -2’ ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. హిట్ 1 లో విష్వక్సేన్ హీరోగా నటించగా.. ఈ చిత్రం లో అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో అడివి శేష్, హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇటీవల రిలీజ్ చేసిన ‘ఊరికే’ సాంగ్ కి డాన్స్ చేసి ఆ వీడియో ని సోషల్ మీడియా లో షేర్ చేసారు. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ఆ పోస్ట్ కి నాని స్పందిస్తూ… ‘‘నా ఆఫీస్‌ను ఇలా కూడా వాడొచ్చా?’’ అని సరదాగా ప్రశ్నించాడు. నాని అడివి శేషుకు ఘాటైన కౌంటర్ ఇవ్వడంతో.. వీళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఇంత స్ట్రాంగ్ గా..? ఈ రేంజ్ లో క్లోజ్ గా ఉంటారా ..? అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
డిసెంబర్ 2న గ్రాండ్గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు . అంతకు ముందు విడుదలైన హిట్ 1 కి మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు సీక్వెల్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి ఈ సినిమాతో అడవి శేష్ ఎటువంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.
End of Article