Ads
ప్రస్తుతం ఉన్న చాలా మంది సినిమా తారలు సీరియల్స్ లో నటించి వచ్చిన వారే. అలాంటి వారిలో ఒక్కడే జూనియర్ ఎన్టీఆర్. మనలో చాలా మందికి ఎన్టీఆర్ సీరియల్ లో నటించిన విషయం తెలీదు.
Video Advertisement
ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి కూడా కళారంగంలోనే ఉన్నాడు. చదువు కంటే కూడా ఎక్కువగా డాన్సులు, నటన విషయంపైనే ఫోకస్ చేసాడు. చిన్నతనం లోనే ‘బాల రామాయణం ‘ లో నటించాడు ఎన్టీఆర్. ఆ విషయం అందరికి తెలుసు. కానీ.. ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే బుల్లితెర పై ఓ సీరియల్ లో నటించాడట. అదే ‘భక్త మార్కండేయ’.
బహుశా ఈ విషయం ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు. ‘భక్త మార్కండేయ’ అనే పేరుతో అప్పట్లో ఓ సీరియల్ టెలికాస్ట్ అయ్యేది. ఈటీవీలో ప్రసారమయ్యే ఈ సీరియల్ లో లీడ్ రోల్ అయిన మార్కండేయ పాత్రని ఎన్టీఆర్ పోషించాడు. శివుడి భక్తుడిగా చిన్న వయసులోనే చాలా అద్భుతంగా ఆ పాత్రని పోషించాడు ఎన్టీఆర్. అటు తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాల రామాయణం’ లో ఎన్టీఆర్… శ్రీరాముని పాత్రని పోషించిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత మూడేళ్ళకు హీరో అయ్యాడు తారక్. 2000లో నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ చిత్రాన్ని ‘ఉషాకిరణ్ మూవీస్’ వారు తెరకెక్కించారు. అలా మొదటిగా బుల్లితెరపై కనిపించిన ఎన్టీఆర్ ఆ తర్వాత తర్వాత ‘బిగ్ బాస్’ అంటూ మరోసారి ప్రేక్షకులకు చేరువయ్యాడు. తర్వాత ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ని కూడా హోస్ట్ చేసాడు ఎన్టీఆర్.
End of Article