Ads
ఆర్ మాక్స్ మీడియా సంస్థ ఎప్పటికప్పుడు ప్రతి నెల టాలీవుడ్ సహా పలు భాషల్లో సీరియల్స్, మూవీస్ అన్నిటిలో టాప్ లో ఎవరు ఉన్నారు అని లిస్ట్ వేస్తూ ఉన్నారు. అలాగే పాన్ ఇండియా లెవెల్లో కూడా హీరోల పరిస్థితి ఎలా ఉందనే విషయం మీద లిస్టు తయారు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యం లో అక్టోబర్ నెలకి గాను ఆర్మాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్ మోస్ట్ పాపులర్ మేల్ స్టార్ జాబితా రిలీజ్ చేసింది. 10 మంది హీరోలు ఈ జాబితాలో స్థానం సంపాదించగా విజయ్ మళ్లీ మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
Video Advertisement
పాన్ ఇండియా హీరో ప్రభాస్ రెండో స్థానానికి పరిమితమైతే, ఆర్ఆర్ఆర్ తో హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ మూడో స్థానంలో నిలిచారు. తర్వాతి స్థానాల్లో అల్లు అర్జున్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, ఐదవ స్థానంలో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్, తమిళ స్టార్ హీరో సూర్య ఏడవ స్థానం, కన్నడ స్టార్ హీరో యష్ ఎనిమిదవ స్థానం, రాంచరణ్ తొమ్మిదవ స్థానంతో సరిపెట్టుకోగా మహేష్ బాబు కూడా పదవ స్థానంతో సరిపెట్టుకున్నారు.
అయితే పాన్ ఇండియా రేంజ్ లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా విజయ్ మళ్లీ మొదటి స్థానాన్ని పొందడం పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆర్మాక్స్ మీడియా సంస్థ చేస్తున్న సర్వేలపై పలు విమర్శలు వస్తున్నాయి. దీంతో ఈ రిపోర్ట్ లు సోషల్ మీడియాలో, మీడియాలో ఎవరి గురించి ఎక్కువ చర్చ జరిగింది అనే అంశం మీదే సబ్మిట్ చేస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.
ప్రస్తుతం విజయ్ వంశి పైడిపల్లి దర్శకత్వం లో ‘వారసుడు’ చిత్రం లో నటిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న కథానాయిక. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రానుంది.
End of Article