Ads
దిల్ రాజు నిర్మాణ సారథ్యం లో అనిల్ రావిపూడి చేసిన చిత్రం F2 . ఈ చిత్రం లో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ 2019 సంక్రాంతి కి విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో వెంకటేష్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా జోడీ కట్టగా.. వరుణ్‌కి జోడీగా మెహ్రీన్ నటించారు.
Video Advertisement
ఈ చిత్రం లో ఫస్టాఫ్ మొత్తం ఫుల్ ఫన్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి ఫుల్ ఎంటర్టైన్ చేయగా.. సెకండాఫ్‌లో ఫన్‌కి ఫస్ట్రేషన్ జోడించి కడుపు చెక్కలయ్యేలా చేసారు. అయితే ఈ సెకండ్ హాఫ్ లో ప్రకాష్ రాజ్ దొరస్వామి నాయుడు అనే పాత్రలో కనిపిస్తారు. ఆయన అన్నయ్యగా నటుడు పృద్వి నటించారు. అయితే పృద్వి పాత్రకి అనారోగ్య సమస్యలు ఉండటం తో షాకింగ్ విషయాలను కూడా చాలా కూల్ గా చెప్తూ ఫన్ జెనెరేట్ చేసారు ప్రకాష్ రాజ్. ఈ సినిమాతో వింటేజ్ వెంకీ కనిపించాడని ఆయన ఫాన్స్ ఖుషి అయ్యారు.
అయితే ఈ సీన్లను చూస్తుంటే గతం లో దర్శకుడు మోహన్ గాంధీ తీసిన ఒక చిత్రం లో బ్రహ్మనందం నటించిన సీన్లు గుర్తొస్తున్నాయంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ చిత్రం లోని సీన్లు, F2 లోని సీన్లు కలిపి కంపేర్ చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ గా కామెంట్లు చేస్తున్నారు.
watch video:
https://www.instagram.com/reel/ClGy3L0JGGc/?utm_source=ig_web_copy_link
End of Article