IPL 2023: ఈ స్టార్ క్రికెటర్ IPL నుండి రిటైర్ అయ్యాడా?

IPL 2023: ఈ స్టార్ క్రికెటర్ IPL నుండి రిటైర్ అయ్యాడా?

by kavitha

Ads

IPL 2023: మరో విండీస్ లెజెండ్ ఐపీఎల్‌ కెరీర్‌కు వీడ్కోలు చెప్తున్నాడా అని అడిగితే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇటీవలే కీరన్ పొలార్డ్ ఐపీఎల్‌ కు వీడ్కోలు పలికాడు. ముంబై జట్టు పొలార్డ్ ని  రిలీజ్ చేయడంతో, నేను మరో జట్టుకు ఆడలేనని పొలార్డ్ తెలిపాడు.

Video Advertisement

అంతే కాకుండా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అయితే పొలార్డ్ వచ్చే సంవత్సరం నుండి ముంబై ఇండియన్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నాడు. ఇప్పుడు ఇంకో విండీస్ క్రికెట్ దిగ్గజం ఐపీఎల్‌ లీగ్ నుండి తప్పుకున్నట్లు సమాచారం. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఇక పై ఐపీఎల్‌లో కనిపించడని వార్తలు వస్తున్నాయి. 2023 లీగ్ కోసం మినీవేలం జరుగుగబోతుంది.Dwayne Bravo 2 telugu adda కోచి వేదికగా ఈ నెల చివర్లో జరిగే వేలంలో  991మంది ఆటగాళ్ల పేర్లు నమోదు అయ్యాయి. నమోదు చేసుకున్న వారిలో వెస్టిండీస్ నుండి 33మంది ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఈ 33 మందిలో డ్వేన్ బ్రావో పేరు లేదు అని తెలుస్తోంది. బ్రావో పేరు లేదని తెలిసిన దగ్గర నుండి అతను కూడా ఐపీఎల్‌ రిటైర్‌మెంట్ చెప్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. డ్వేన్ బ్రావో ముంబై జట్టుతో తన ఐపీఎల్ ప్రయాణం మొదలుపెట్టాడు. 2011లో చెన్నై జట్టుతో కలిశాడు. ఇక అప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ 2011, 2012, 2021ల్లో ఐపీఎల్ ట్రోఫీ తేవడంలో ముఖ్యపాత్ర పోషించాడు.
ఇప్పటివరకు బ్రావో 161 ఐపీఎల్ మ్యాచులు ఆడి, 158 వికెట్లు తీసాడు. గత ఏడాదిలో  పది మ్యాచులు ఆడి,  16 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే  ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ మినీ వేలానికి ముందు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంది. అందులో భాగంగా  పద్నాలుగు మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుని, మిగతా ఆటగాళ్లను వద్దనుకుంది. వదిలేసిన వారిలో డ్వేన్ బ్రావోతో పాటు జగదీశన్, రాబిన్ ఊతప్ప, ఆడమ్ మిల్నే,క్రిస్ జోర్డాన్ లాంటి వారు ఉన్నారు.


End of Article

You may also like