Ads
చంద్రమోహన్.. పెద్ద స్టార్ హీరోలతో సరిసమానంగా హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. అటు హీరోగా కొనసాగుతున్న సమయంలోనే.. హాస్య నటుడిగా.. తండ్రిగా, స్నేహితుడిగా ఇలా ఎన్నో పాత్రలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలం నుంచి ఇప్పటి వరకు యాక్టివ్ గా ఉన్న నటులలో చంద్రమోహన్ ఒకరు. దాదాపు 55 సంవత్సరాల పాటు నటిస్తూనే ఉన్నారు.
Video Advertisement
బీ.ఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘రంగుల రాట్నం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు చంద్రమోహన్. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేసి టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్నాడు. చంద్రమోహన్ కథానాయకుడిగా దాదాపు 172 సినిమాల్లో నటించారు. అలాగే మొత్తం 932 చిత్రాల్లో నటించి మెప్పించారు. అయితే గత నాలుగేళ్లుగా చంద్రమోహన్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. చివరిగా ఈయన గోపిచంద్ హీరోగా చేసిన ‘ఆక్సిజన్’ సినిమాలో నటించాడు.
నిర్విరామంగా 50 సంవత్సరాల పాటు సినిమాలు చేస్తూ.. ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేశానని ఆయన తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు . ప్రస్తుతం కరోనా పరిస్థితులు.. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సినిమాలు మానేశానని ఆయన చెప్పారు. ఆ ఇంటర్వ్యూ లో తన సినీ ప్రస్థానం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
ఆ ఇంటర్వ్యూ వీడియో లో చంద్రమోహన్ ని చూసిన ఆయన అభిమానులు, తమ అభిమాన నటుడు ఇలా అయిపోయారేంటని బాధపడుతున్నారు. అప్పట్లో చంద్రమోహన్ ను కొత్త హీరోయిన్లకు లక్కీ హీరో అనేవారు. అటువంటి వ్యక్తి ప్రస్తుతం అనారోగ్యాలతో, వయోభారంతో .. ఇలా ఉండటాన్ని చూడలేకపోతున్నామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఆ ఇంటర్వ్యూలో చంద్రమోహన్ తను సంపాదించి స్వయంగా పోగొట్టుకున్న ఆస్తుల గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక స్థిరాస్తులను అప్పట్లో మైంటైన్ చెయ్యలేక అమ్మేయగా.. అవి ఇప్పుడు కోట్లలో ధర పలుకుతున్నాయని ఆయన వెల్లడించారు. తనకు సినీ జీవితం చాలా నేర్పించిందని.. పేరు, డబ్బు, బంధాలు శాశ్వతం కాదని తెలుసుకున్నానని.. అలాగే.. నమ్మకద్రోహులకు దూరంగా ఉండాలని.. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదమని తెలుసుకున్నట్లు చెప్పారు.
watch video :
End of Article