Ads
Yashoda OTT release: సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యశోద. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. యశోద సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.
Video Advertisement
నవంబరు 11న విడుదలైన యశోద తొలి రోజే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని రూ.30 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి హిట్‌గా నిలిచింది. సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లోనూ మంచి లాభాలను రాబట్టింది. ఈ సినిమా తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో కూడా మంచి వసూళ్లని రాబట్టింది. సరోగసీ అనే సున్నితమైన అంశం పై తెరకెక్కిన ఈ సినిమాకి హరి, హరీష్ డైరెక్షన్ చేశారు. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ గా చేసింది. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు. యశోద ఓటీటీ విడుదలపై క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది. మయోసైటిస్‌తో అనే దీర్ఘకాలిక వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే సమంత ఈ సినిమాలో ఫైట్స్ చేసింది. సమంత చేసిన కొన్ని స్టంట్స్ అందర్నీ ఆశ్చర్యపర్చాయి. థియేటర్ల నుండి వెళ్లిపోయిన యశోద సినిమా కోసం ఓటీటీ ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఇటీవల ఈ మూవీ పై ఇవా హాస్పటల్ పరువు నష్టం దావా వేసింది. ఈ మూవీ పై ఈవా పేరుతో ఉన్న సరోగసీ సెంటర్‌లో నేరం చేసినట్లుగా చూపించారని, ఓటీటీలో కూడా ఈ మూవీ రిలీజ్ ఆపేయాలని ఇవా హాస్పటల్ యాజమాన్యం డిమాండ్ చేసింది. అయితే నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ వారితో రాజీ కుదుర్చుకున్నారు. ఓటీటీలో విడుదల చేసే వెర్షన్‌లో హాస్పటల్ బ్లర్ చేస్తామని చెప్పారు. దీంతో ఓటీటీ రిలీజ్‌కి అడ్డంకి తొలిగింది. డిసెంబరు 9న స్ట్రీమింగ్ అవబోతునట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ప్లాప్ సినిమాలనే త్వరగా ఓటీటీలో రిలీజ్ చేస్తారు.కానీ యశోద సినిమా హిట్ అయ్యింది. అయిన కూడా ఇంత త్వరగా ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారో అని అంటున్నారు.
End of Article