Ads
సినిమా రంగంలో ఒక ప్రొడక్షన్ మేనేజర్ గా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్ ఆ తర్వాత కాలంలో నటుడిగా మారారు.. కొంత కాలం పాటు వరుసగా సినిమాల్లో నటుడిగా రాణించినా ఆ తర్వాత నిర్మాతగా మారి స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు.. అయితే ఆయన ఎక్కువగా పవన్ కళ్యాణ్ భక్తుడిగా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు.
Video Advertisement
అయితే బండ్ల గణేష్ పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇచ్చిన స్పీచ్ వింటే ఆయన కి పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో అర్థం అవుతుంది. పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటూ బండ్ల గణేష్ ఇచ్చిన స్పీచ్ వీడియో ఎప్పటికి ఎవర్గ్రీన్ గా నిలిచిపోయింది.
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ సాహో ఫేమ్ సుజీత్ తో సినిమా చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఓ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. ఆ పోస్టర్ లో ‘అగ్ని తుపాను రాబోతుంది’ అని జపనీస్ అక్షరాల్లో రాసి ఉంది. దీంతో జపాన్ నేపథ్యంలో చిత్రకథ ఉంటుందని సమాచారం.
ఈ నేపథ్యం లో పవన్ కళ్యాణ్ – సుజీత్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ స్పీచ్ ఇస్తే ఇలాగె ఉంటుంది అంటూ..ఒక ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఆయన జపనీస్ లో స్పీచ్ ఇస్తున్నట్లు ఉంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ గా కామెంట్లు చేస్తున్నారు.
పవన్ సినిమా ఈవెంట్ అంటే బండ్ల గణేష్ స్పీచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఈయన పవన్ కు హార్డ్ కొర్ ఫ్యాన్ గా టాలీవుడ్ లో నిలిచి పోయాడు. “భారత చలన చిత్ర పరిశ్రమలో నంబర్ వన్ చిత్రంగా ఈ చిత్రం నిలవాలని.. నిలిచే విధంగా రూపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బండ్ల గణేష్” అంటూ తనదైన శైలిలోపవన్ సినిమా పై స్పందన అందించారు.
End of Article