Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు.. తెలుగు రాష్ట్రాల్లో ఈయనకున్న క్రేజ్ వేరు. కృష్ణ వారసుడుగా వెండి తెరకు పరిచయమై తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఆయన స్టైల్, విలక్షణ సినిమాల ఎంపిక, యాక్టింగ్ తిరుగులేని స్టార్ గా నిలబెట్టాయి. మరోవైపు సామాజిక సేవతో రియల్ హీరో అనిపించుకున్నాడు. రెండు గ్రామాలను దత్తత తీసుకున్న మహేష్.. వెయ్యికి పైగా చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ కూడా చేయించాడు.
Video Advertisement
అయితే మహేష్ లోని మరో కోణం..ఆయనొక కంప్లీట్ ఫామిలీ మాన్. క్షణం తీరిక లేకుండా గడిపే మహేష్ కుటుంబానికి చాలా ప్రాధాన్యతనిస్తారు. విరామం దొరికితే భార్య పిల్లల్తో విదేశాలకు విహారాలకి వెళ్తాడు మహేష్. మహేష్ ఓ మంచి హస్బెండ్, మంచి ఫాదర్. 2005 లో మహేష్, నమ్రత వివాహం చేసుకున్నారు. వీరి వివాహం అప్పట్లో ఓ సంచలనం. అంతే రిజర్వేడ్ గా ఉండే మహేష్ ఎలా ప్రేమలో పడ్డాడన్న దానిపై అప్పట్లో పెద్ద చర్చలే జరిగాయి.
అయితే పలు సందర్భాల్లో మహేష్, నమ్రత తమ ప్రేమ , పెళ్లి గురించి స్పందించారు. దర్శకుడు బి. గోపాల్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన వంశి చిత్ర షూటింగ్ సమయం లో మహేష్ కి, నమ్రతకి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత 5 ఏళ్ళకి వారికి వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాత నమ్రత సినిమాలు మానేయాలని మహేష్ కండిషన్ పెట్టారట. దానికి నమ్రత ఒప్పుకున్నారట. అందుకే ఎన్ని అవకాశాలు వచ్చిన నమ్రత సినిమాల్లో నటించలేదు. కానీ మహేష్ కి సంబంధించిన సినిమాల వ్యవహారాలన్నీ నమ్రత నే చూసుకుంటారు.
అలాగే నమ్రత కూడా మహేష్ కి ఒక కండిషన్ పెట్టారట. పెళ్లి అయిన తర్వాత కొంతకాలం ఒక అపార్ట్మెంట్ లో ఉందామని నమ్రత కోరారట. అందుకే పెళ్లయ్యాక చాలా కాలం మహేష్ దంపతులు జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలానికి సమీపం లోని ఒక అపార్ట్మెంట్ లో ఉండేవారు. ఈ విషయాన్ని నమ్రత ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు. అలాగే గౌతమ్ పుట్టిన సమయం లో చాలా ఇబ్బందులు రావడంతో ఇంకో బిడ్డ వద్దు అనుకున్నారట మహేష్ దంపతులు. సితార తమకు అనుకోని వరం అని చెప్పారు.
End of Article