Ads
సాధారణం గా సినీ ఇండస్ట్రీ లో హీరోయిన్స్ కెరీర్ చాలా తక్కువ కాలమే ఉంటుంది. మహా అయితే ఒక అయిదు నుంచి పది సంవత్సరాలు ఉంటుంది. అందుకే కెరీర్ పీక్స్ లో ఉండగానే చాలా మంది హీరోయిన్లు కొన్ని బిజినెస్ లు స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు.
Video Advertisement
ప్రస్తుత కాలం లో డబ్బు సంపాదించటం ఒకటే సరిపోదు. దాన్ని ఎలా కాపాడుకోవాలి.. ఎలా పెంచుకోవాలి అని కూడా తెలియాలి. లేదంటే జీవితం లో ముందుకి వెళ్ళలేరు. అందుకే చాలా మంది హీరోయిన్స్ బిజినెస్ లు చేస్తూ రాణిస్తున్నారు. ఇప్పుడు వారెవరో చూద్దాం..
#1 రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ కి ఫిట్నెస్ అంటే ఎంత మక్కువో మనకి తెలిసిందే. దాదాపు అన్ని రకాల ఫిట్ నెస్ విధానాలన్నిటిని ట్రై చేసే ఉంటుంది రకుల్. తనకు తెలిసిన విద్యని నలుగురికి పంచాలనే ‘F45 ఫిట్నెస్ స్టూడియోలు’ స్టార్ట్ చేసారు రకుల్. ఫిజికల్ ఫిట్‌నెస్‌కీ, మెంటల్ హెల్త్ కీ ఎప్పుడూ జబర్దస్త్ కనెక్షన్ ఉంటుందంటారు రకుల్ ప్రీత్ సింగ్.
#2 తమన్నా
తమన్నాకి ఎప్పటినుంచో గోల్డ్ ఆర్నమెంట్స్ డిజైనింగ్ మీద ఇంట్రస్ట్ ఉంది. అందుకే తాను స్వయంగా డిజైన్ చేసిన జువెలరీని ఆన్‌లైన్‌లో అమ్ముతుంటారు తమన్నా భాటియా. దాని పేరు ‘వైట్ అండ్ గోల్డ్ జువెలరీ’.
#3 కాజల్
పెళ్లయిన తర్వాత కూడా భర్తతో కలిసి ఓ బిజినెస్ స్టార్ట్ చేశారు కాజల్ అగర్వాల్. తన భర్త కిచ్లు తో కలిసి ఫర్నిచర్ బిజినెస్ ని స్టార్ట్ చేసింది కాజల్. దాని పేరు ‘కిచెడ్’.
#4 సమంత
మధ్య తరగతి అమ్మాయిలు కూడా బ్రాండెడ్ బట్టలు ధరించాలన్న ఆశయంతో ‘సాకీ’ గార్మెంట్ బ్రాండ్ ని స్టార్ట్ చేసింది సమంత. ఇందులో ప్రతి డిజైన్‌లోనూ నా మనసు కనిపిస్తుంది అని అంటారు సమంత. కాస్ట్యూమ్స్ మాత్రమే కాదు, పసిపిల్లలకు సంబంధించి ఎడ్యుకేషనల్ ఫీల్డ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు సామ్. నటిగా బిజీగా ఉంటూనే, బిజినెస్‌లు కూడా స్వయంగా చూసుకుంటున్నారు సామ్.
#5 తాప్సి
తన సోదరి షగుణ్ నిర్వహిస్తున్న ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ‘ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ’ కి తనవంతు సపోర్ట్ చేస్తున్నారు తాప్సి. ఈవెంట్ మేనేజ్‌మెంట్ బిజినెస్ మీద కంప్లీట్ అవేర్‌నెస్ ఉంది తాప్సీకి.
#6 ప్రణీత
వరు ఏ రంగంలో రాణించాలన్నా, హెల్త్ ఇంపార్టెంట్ అనీ, మంచి ఆరోగ్యం కావాలంటే మంచి ఆహారం కావాలని, జిహ్వకు నచ్చే భోజనంతో పాటు, ఆరోగ్యాన్ని ప్రసాదించే ఫుడ్ మీద తనకు కాన్‌సెన్‌ట్రేషన్ ఎక్కువని చెబుతారీ బాపు బొమ్మ. దాని పేరు ‘బూట్ లెగ్గెర్ రెస్టారెంట్’.
#7 శ్రేయ
సమాజానికి తన వంతు సాయం ఏదోకటి చేస్తానన్న శ్రేయ.. విజువల్లీ ఛాలెంజెడ్ పీపుల్ తో ‘శ్రీ స్పందన’ స్పా రన్ చేస్తున్నారు శ్రేయ.
#8 అలియా భట్
తాను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వచ్చిన ఆలోచనతో ‘ఎడ్ ఏ మమ్మ’ అనే క్లోతింగ్ బ్రాండ్ ని స్టార్ట్ చేసింది అలియా భట్. ఇందులో మెటర్నిటీ వేర్ తో పాటు, చిన్నారుల దుస్తులు ఉంటాయి.
End of Article