Ads
కమలినీ ముఖర్జీ.. తెలుగు ఆడియెన్స్‌కి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. చేసింది కొన్ని సినిమాలే అయినా.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు. హిందీ సినిమాలతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా.. టాలీవుడ్ లో 2004 లో శేఖర్ కమ్ముల తీసిన ‘ఆనంద్’ చిత్రం తో సాలిడ్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల తెరకెక్కించిన గోదావరి, హ్యాపిడేస్ లాంటి చిత్రాలతో పాటు గమ్యం, గోపి గోపిక గోదావరి, గోవిందుడు అందరివాడేలే చిత్రాలు చేసింది.
Video Advertisement
2014లో వచ్చిన గోవిందుడు అందరివాడేలే చిత్రం తెలుగులో ఆమెకు తెలుగులో చివరి సినిమా. మలయాళం లో 2016 లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వచ్చిన పులి మురుగన్ (మన్యం పులి ) చిత్రం ఆమె చేసిన చివరి సినిమా. కమలినీ ముఖర్జి ఈ సినిమాలో మోహన్ లాల్ సరసన జంటగా కనిపించింది. ఆ తర్వాత ఆమె కెరీర్ ఫేడౌట్ అయిపోయింది. సినిమాలు చేయడం మానేసిన ఆమె పబ్లిక్ ఈవెంట్స్‌లోనూ దర్శనం ఇవ్వడం లేదు. హీరోలకు ఉన్నంత కెరీర్ స్పాన్ హీరోయిన్స్‌కి ఉండదనే విషయం మరోసారి కమలినీ ముఖర్జి విషయంలో ప్రూవ్ అయింది.
అయితే ఈ సినిమా తరువాత దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత డలాస్‌లో ఓ ఈవెంట్ లో కమలిని కనిపించింది. అక్కడ ఆమెను చూసిన వాళ్లంతా షాక్ అయ్యారు. అప్పుడు స్లిమ్ బ్యూటీలా ఉన్న కమలినీ ముఖర్జీ ఇప్పుడు బబ్లీ బ్యూటీలా అయిపోయింది. ఆమె పేరు చెప్తే గాని ఆమెను గుర్తుపట్టలేకపోయారు. సినిమాలు మానేసిన తర్వాత అమెరికాలోనే స్థిరపడ్డారామె. కమలిని లేటెస్ట్ ఫోటోలు చూసిన ఆమె ఫాన్స్ షాక్ అవుతున్నారు.
చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఆమె తన అందం , అభినయం తో తెలుగు అమ్మాయిలా ఉంటూ.. తెలుగు వారి అభిమానాన్ని చూరగొన్నారు. ప్రస్తుతం ఆమె అమెరికా లో వ్యాపారం చేస్తూ స్థిరపడ్డారని సమాచారం. ఇక ఆమె వ్యక్తిగత వివరాలు ఏమి తెలియరాలేదు. వ్యాపారంలోనే రాణిస్తూ మళ్లీ సినిమాలవైపు రావట్లేదని తెలుస్తోంది. ఆమె తాజా ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
End of Article