తెలుగు పాటని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన… RRR “నాటు నాటు” వెనుక ఇంత స్టోరీ ఉందా..?

తెలుగు పాటని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన… RRR “నాటు నాటు” వెనుక ఇంత స్టోరీ ఉందా..?

by Anudeep

Ads

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ అంతర్జాతీయ పురస్కారమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడంతో దేశవ్యాప్తంగా మూవీ టీంకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అవార్డ్స్ లో ఆర్ఆర్ఆర్ మూవీ.. బెస్ట్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ రెండు క్యాటగిరీల్లో నామినేషన్ లో నిలువగా, ‘నాటు నాటు’ సాంగ్ అవార్డుని కైవసం చేసుకొంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి. చంద్రబోస్ ఈ పాటకి లిరిక్స్ అందించారు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఇద్దరు కలిసి పాడారు. అయితే ఈ అవార్డు వేడుకలకు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు.

Video Advertisement

ఆసియా నుండి గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకున్న తొలి పాట ఇదే కావడం విశేషం. ఈ అవార్డు గెలుచుకోవడం పట్ల పలువురు సినీ ప్రముఖులు ఆర్‌ఆర్‌ఆర్‌ బృందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా అసలు ఈ పాట ఎలా పుట్టింది..? దీని వెనుక కథేంటో.. ఇప్పుడు తెలుసుకుందాం.. ఇండియా లోని బెస్ట్ డాన్సర్స్ లిస్ట్ లో తారక్, చరణ్ ఇద్దరూ ఉంటారు. వీరిద్దరి డాన్స్ లకు అభిమానులు ఊగిపోతారు. అయితే వీరిద్దరూ కలిసి ఒకే ఫేమ్ లో డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అని రాజమౌళి ఆలోచించాడు.

the story behind RRR 'natu natu' song..!!

అనుకున్నదే తడవుగా కీరవాణిని పిలిపించి.. చరణ్‌, తారక్‌లు ఇద్దరూ కలిసి డ్యాన్స్‌ చేయడానికి ఒక మాస్‌ పాట కావాలి అని అన్నాడట. ఇద్దరు బెస్ట్‌ డ్యాన్సర్‌ల కోసం పాటంటే ఇంకే రేంజ్‌లో ఆలోచించాడో అని కీరవాణి గ్రహించాడు. దీనికి సాహిత్యం అందించేందుకు చంద్రబోస్ ని ఎన్నుకున్నారు. ఈ క‌థ 1920 ప్రాంతంలో జ‌రుగుతుంది కాబ‌ట్టి ఆ కాలానికి త‌గిన మాట‌లు వాడాలి అంటూ చంద్రబోస్‌కు కీరవాణి చెప్పాడట. చంద్రబోస్‌ ఆలోచనలోంచి పుట్టిన పదమే ‘నాటు నాటు’.

the story behind RRR 'natu natu' song..!!

ఈ పాటకు ట్యూన్‌ అంటూ ఏమిలేదు. ముందుగా చంద్రబోస్‌ ‘నా పాట పాడు’ అనే పదాన్ని రాశాడు. దాన్ని కీరవాణి ‘నా పాట చూడు’గా మార్చాడు. కానీ మార్పులు, చేర్పులు చేస్తూ.. నాటు నాటు పాట పూర్తి స్థాయిలో సిద్ధం కావడానికి దాదాపు 19 నెలలు పట్టింది. ఆ తర్వాత డాన్స్ కొరియోగ్రాఫర్ గా ప్రేమరక్షిత్ ని ఎన్నుకున్నారు. ఇక ప్రేమ్‌ రక్షిత్‌ ఈ పాట కోసం దాదాపు 95 స్టెప్పులు కంపోజ్‌ చేశాడు. తారక్‌, చరణ్‌లు భుజాలపై చేతులేసుకుని వేసిన హూక్‌ స్టెప్‌ కోసం ఏకంగా 30 వెర్షన్‌లు రెడీ చేశాడు. ఆ స్టెప్‌ పర్‌ఫెక్ట్‌గా మానిటర్‌పై కనబడానికి రాజమౌళి 19 టేకులు తీసుకున్నాడు. కానీ చివరికి రెండో టేకునే ఓకే చేశాడు.

 

the story behind RRR 'natu natu' song..!!
“ఎన్టీఆర్, రామ్ చరణ్ డ్యాన్స్ చేయబోయే ఆ పాట మిగిలిన పాటల కంటే డిఫరెంట్‌గా ఉండాలని ముందే అనుకున్నాం. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో ఆ పాటని షూట్ చేశాం. అప్పటికి ఉక్రెయిన్‌లో యుద్ధ ఛాయలు లేవు. ఆ సాంగ్ వెనుక కనిపించే ఫ్యాలెస్‌ ఉక్రెయిన్‌ అధ్యక్షుడిది. ఆ బిల్డింగ్ పక్కనే పార్లమెంట్ కూడా కనిపిస్తుంది.’ అని రాజమౌళి గతం లో ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించారు.

the story behind RRR 'natu natu' song..!!

అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్ డ్యాన్స్ చేస్తుంటే వచ్చే దుమ్ము కోసం కూడా రాజమౌళి కొన్ని టేకులు తీసుకున్నట్లు చిత్ర బృందం గత ఏడాది ఒక సందర్భంలో గుర్తు చేసుకుంది. ఇలా ఒక్క పాట కోసం ఆర్‌ఆర్‌ఆర్‌ బృందం అంత కష్టపడ్డారు గనుకే ఈ పాటకు ఇప్పుడు గ్లోబల్‌గా ప్రశంసలు దక్కుతున్నాయి.ప్రస్తుతం ఆస్కార్ ఎలిజిబుల్ లిస్ట్ లో బెస్ట్ మూవీగా ఆర్ఆర్ఆర్ రేసులో నిలిచింది. జనవరి 12 నుంచి 17 వరకు ఈ ఎలిజిబుల్ లిస్ట్ కి ఓటింగ్ ఉంటుంది. ఎక్కువ ఓట్లు వచ్చిన సినిమాలు ఆస్కార్ నామినేషన్స్ లో నిలవనున్నాయి.


End of Article

You may also like