Ads
దోమలు ప్రతీ ఇంట్లో కామన్. కాస్త చీకటి పడితే చాలు.. దోమలు కుప్పలు తెప్పలుగా ఇంట్లోకి వస్తాయి. సూదుల్లా గుచ్చి.. మన రక్తాన్ని పీల్చుతాయి. మస్కిటో రెపల్లెంట్స్ ఎన్ని పెట్టినా.. అస్సలు తగ్గవు. గుచ్చి..గుచ్చి.. అనారోగ్యం పాలుచేస్తాయి. మన వద్ద దోమల బీభత్సం అంతలా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా దోమల కాటు వల్ల కలిగే వ్యాధుల కారణంగా ప్రతి సంవత్సరం ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3 వేల జాతుల దోమలు.. ఈ భూమి మీద ఉన్న ఇతర జంతువుల కంటే ఎక్కువ వ్యాధులను వ్యాప్తి చేస్తాయి.
Video Advertisement
మలేరియా, టైఫాయిడ్, డెంగీ, జికా వైరస్.. ఇలా ఎన్నో రకాల రోగాలు దోమల నుంచే వస్తాయి. అందుకే ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం దోమలపై యుద్ధం చేస్తుంటాయి. వాటిని మట్టుబెట్టేందుకు ఎన్నో రకాల చర్యలు చేపడుతున్నాయి. ఐనప్పటికీ దోమల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. వాటి వల్ల వచ్చే రోగాలూ పోవడం లేదు. అందుకే అసలు ఈ ప్రపంచం లో దోమలు ఎందుకున్నాయి.. వాటి వాళ్ళ మనకి ఏం ఉపయోగం లేదు కదా.. వాటిని చంపేస్తే సరిపోతుంది కదా అనుకుంటున్నారా..??
అసలు ఈ దోమలే లేకపోతే ఇన్ని సమస్యలు రావు కదా.. వాటిని చంపేద్దాం అనుకుంటున్నారా.. కానీ అది తప్పు.. అసలు ప్రపంచం లో దోమలు లేని ప్రదేశాలు ఉన్నాయా అంటే.. ఉన్నాయి. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఐస్‌లాండ్… ఈ ప్రపంచంలో దోమల లేని దేశం. ఇక్కడ దోమలతో పాటు పాములు, ఇతర సరీసృపాలేవీ కనిపించవు. కొన్ని రకాల సాలెపురుగులు మాత్రమే ఐస్‌లాండ్‌లో ఉంటాయి. వాటి వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదు. ఐస్‌లాండ్‌తో పాటు అంటార్కిండా మంచుఖండంలోనూ దోమలు ఉండవు.
అయితే మనం ప్రపంచం లో ఉన్న దోమలన్నిటిని చంపేస్తే పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. అవి లేకపోతే పరంగా సంపర్కం కూడా జరగదు. దాని ద్వారా కొన్న జీవులకు ఆహారం అందకుండా పోతుంది. ఈ పర్యావరణం లో ఏ ఒక్క జీవిని మనం నిర్మూలించాలని చూసినా పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే ప్రతి చిన్న జీవి ఈ ప్రపంచానికే అవసరమే కానీ అనవసరం కాదు అన్న నిజాన్ని మనం తెలుసుకోవాలి.
watch video :
https://www.instagram.com/reel/CnRxpufBp95/?igshid=YmMyMTA2M2Y%3D
End of Article