Ads
తెలుగులో పరభాషా నటీనటులు తళుక్కునమనడం కొత్తేమి కాదు. వివిధ రాష్ట్రాల నటీమణులు తెలుగులో ఇప్పటికే తమని తాము నిరూపించుకున్నారు. వారిలో ఎక్కువగా ముంబై వాళ్లే ఉండేవారు. ఇప్పుడు తమిళ, కన్నడ, మలయాళ భామలు కూడా తెలుగులో సత్తా చాటుతున్నారు. ఇక ఈ ఏడాది తెలుగు తెరపై సందడి చేయనున్న హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
Video Advertisement
#1 ప్రియా భవాని శంకర్
ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన చిన్న చిత్రం కళ్యాణం కమనీయం. ఈ చిత్రం తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రియా భవాని శంకర్. అనిల్ కుమార్ ఆళ్ళ తెరకెక్కించిన ఈ చిత్రం లో సంతోష్ శోభన్ హీరోగా నటించారు. ఈ కన్నడ భామ తన తొలి చిత్రం తోనే నటిగా తనని తాను నిరూపించుకుంది.
#2 ఆషిక రంగనాథ్
నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా రూపొందిన తాజా సినిమా ‘అమిగోస్’. ఇందులో ఆషిక హీరోయిన్ గా నటించనుంది. ‘అమిగోస్’లో ఇషిక పాత్రలో ఆషిక నటిస్తున్నారు.
#3 అవంతిక
మైనే ప్యార్ కియా ఫేమ్ భాగ్యశ్రీ కూతురు అవంతిక హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అరంగేట్రం చేయబోతున్నారు. బెల్లంకొండ గణేష్ హీరోగా నటించనున్న ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రం లో ఆమె శృతి వాసుదేవన్ అనే క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.
#4 అనికా సురేంద్రన్
ఇప్పటికే పలు తమిళ సూపర్ హిట్ చిత్రాలలో బాల నటిగా నటించిన అనికా.. గతేడాది నాగార్జున హీరోగా వచ్చిన ‘ది ఘోస్ట్’ చిత్రం తో తెలుగు వారికీ పరిచయమైంది. ఈ ఏడాది ఆమె హీరోయిన్ గా ‘బుట్ట బొమ్మ’ చిత్రం తో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ చిత్రం లో పల్లెటూరి యువతిగా అనికా నటించనుంది.
#5 సాక్షి వైద్య
దర్శకుడు సురేందర్ రెడ్డి, అక్కినేని అఖిల్ తీయబోతున్న చిత్రం ‘ఏజెంట్’ లో సాక్షి వైద్య హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది.
#6 గాయత్రీ భరద్వాజ్
రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు చిత్రం లో ఒక హీరోయిన్ గా గాయత్రీ భరద్వాజ్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు.
#7 మాళవిక మోహన్
తమిళ హీరో విజయ్ నటించిన మాస్టర్ చిత్రం తో మెప్పించిన మాళవిక మోహన్.. తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్ తో పరిచయం కానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతీ కాంబినేషన్ లో రానున్న చిత్రం లో ఒక కథానాయికగా మాళవిక తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
#8 నుపుర్ సనన్
హీరోయిన్ కృతి సనన్ చెల్లెలైన నుపుర్ సనన్ ఇప్పటికే పలు హిందీ చిత్రాల్లో నటించినది. ఆమె ప్రస్తుతం రవితేజ హీరోగా నటించిన ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది.
#9 జాన్వీ కపూర్
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న పాన్ ఇండియా చిత్రం లో నాయికగా శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైంది. ఈ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది.
End of Article