Ads
బాలయ్య వ్యాఖ్యాతగా ఆహాలో అన్ స్టాపబుల్ కార్యక్రమం ప్రసారమవుతున్న విషయం మనకు తెలిసిందే. బాలయ్య హోస్ట్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ షో లో ఇప్పటికే పలువురు సెలెబ్రెటీలు గెస్టులు గా పాల్గొన్నారు. మొదటి సీజన్ సూపర్ హిట్ కావడం తో రెండో సీజన్ ని స్టార్ట్ చేసారు. రెండవ సీజన్ లో భాగంగా ఈ కార్యక్రమానికి సినీ సెలెబ్రిటీలను మాత్రమే కాకుండా రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించడంతో ఈ కార్యక్రమం మరింత ఆదరణ సంపాదించుకుంది.
Video Advertisement
ఇక తాజాగా ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది.ఇక ఈ ఎపిసోడ్ పై ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి. ఈ షో లో బాలయ్య పవన్ కళ్యాణ్ ను ఎలాంటి ప్రశ్నలు అడిగారు పవన్ ఎలాంటి సమాధానం ఇచ్చారు అనేదానిపై ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
అయితే బాలయ్య షోకు కూడా పవన్ బ్లాక్ హుడీలో వచ్చాడు. సూపర్ స్టైలిష్ గా ఉంది ఈ హుడీ. దీంతో పవన్ కళ్యాణ్ ధరించిన ఈ బ్లాక్ హుడి ధర ఎంత ఉంటుంది అని పెద్ద ఎత్తున ఫాన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ధరించిన ఈ హుడి హ్యూగో బాస్ కంపెనీకి చెందింది. దీని ధర విదేశాల్లో అయితే 245 డాలర్లుగా ఉంది. ఇది మన భారతీయ మార్కెట్ లో రూ.20 వేల నుంచి రూ.27 వేల వరకు ఉంటుందని తెలుస్తోంది.
ఇక ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో పవన్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 3 ప్రాజెక్టులకు ఓకే చెప్పిన పవన్ వాటిని ఎప్పటికి పూర్తి చేస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు సాహో ఫేమ్ సుజీత్ తో పవన్ సినిమా చేయనున్నట్లు డీవీవీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
End of Article