Ads
పెళ్లి అనగానే ఎంత హడావుడి, బంధు మిత్రులు సందడి, పెద్ద ఎత్తున భోజనాలు, పట్టుచీరలు, ఆభరణాల ధగధగలు.. అబ్బో లక్షల్లో ఖర్చు. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే కాబట్టి చాలామంది తమ పెళ్లి వేడుక ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు.
Video Advertisement
మధ్యతరగతి వారే ఇలా అనుకుంటే నిత్యం లైమ్ లైట్ లో ఉండే సినీతారల పెళ్లి ఏ రేంజ్ లో జరుగుతుందో చెప్పక్కర్లేదు. సెలబ్రెటీల పెళ్లి అంటే.. అబ్బో.. హడావుడి అంతా.. ఇంతా.. కాదు. ఇప్పుడు ఏ సినీతారల పెళ్ళికి ఎంత ఖర్చు చేసారో ఇప్పుడు చూద్దాం..
#1 ప్రియాంక చోప్రా – నిక్ జోనాస్
అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా 2018 లో వివాహం చేసుకున్నారు. రాజస్థాన్ లో జరిగిన ఈ వివాహానికి 45 కోట్లు ఖర్చుపెట్టారు. మొత్తం వివాహానికి సంబంధించిన అన్ని ఖర్చులు కలిపి దాదాపు 100 కోట్లు అయినట్టు సమాచారం.
#2 దీపికా పదుకొనె – రణవీర్ సింగ్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా, హీరో రణవీర్ తమ పెళ్లి కార్యక్రమాలు మొత్తానికి కలిపి 70 కోట్లు ఖర్చుపెట్టినట్టు సమాచారం.
#3 విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ
క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ 2017 లో ఇటలీ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. వీరి వివాహానికి మొత్తం 100 కోట్లు ఖర్చయినట్లు సమాచారం.
#4 సైఫ్ అలీఖాన్ – కరీనా కపూర్
సైఫ్ – కరీనా 2012 లో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్ళికి 10 కోట్లు ఖర్చు చేసారు ఈ జంట.
#5 కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్
కత్రినా – విక్కీ పెళ్ళికి నాలుగు కోట్లు ఖర్చు చేసారు.
#6 శిల్పా శెట్టి – రాజ్ కుంద్రా
హీరోయిన్ శిల్పా శెట్టి, బిజినెస్ మన్ రాజ్ కుంద్రా ని 2009 లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి అప్పట్లోనే 4 కోట్లు ఖర్చు చేసారు.
#7 అర్పితా ఖాన్ – ఆయుష్ శర్మ
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ వివాహం యువనటుడు ఆయుష్ శర్మ తో జరిగింది. వారి వివాహం తాజ్ ఫలక్నుమా లో జరిగింది. దీనికి 5 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం.
#8 హన్సిక మోత్వానీ – సోహైల్ కతూరియా
హీరోయిన్ హన్సిక, బిసినెస్ మాన్ సోహైల్ కతూరియా ని వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి 20 కోట్లు ఖర్చు అయింది.
#9 సోనమ్ కపూర్ – ఆనంద్ అహుజా
బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్, బిసినెస్ మాన్ ఆనంద్ అహుజా ని వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి 4 కోట్లు ఖర్చు అయింది. ఇందులో ఆమె లెహంగా 70 లక్షలు, పెళ్లి ఉంగరం 90 లక్షలు ఖర్చు అయిందట.
#10 సమంత – నాగచైతన్య
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, హీరో నాగ చైతన్య వివాహానికి 10 కోట్లు ఖర్చు అయింది.
#11 ఐశ్వర్య రాయ్ – అభిషేక్ బచ్చన్
స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ని 2007 లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి అప్పట్లోనే 6 కోట్లు ఖర్చు చేశారట.
#12 కియారా అద్వానీ – సిద్దార్థ్ మల్హోత్రా
బాలీవుడ్ నటులు కియారా- సిద్దార్థ్ మల్హోత్రా తాజాగా పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్ళికి సుమారు 6 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం.
End of Article