Ads
ఎన్నో చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఎల్బీ శ్రీరామ్. నటుడిగా, రచయితగా, డైరెక్టర్గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసుకున్నారు. కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన ‘ఆమ్మో ఒకటో తారీఖు’ చిత్రం తో సీరియస్ పాత్రలు కూడా చేయగలనని నిరూపించుకున్నారు. సినిమాల పట్ల ఎంతో అంకితభావం ఉన్న ఎల్బీ శ్రీరామ్ ఇప్పటికి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్నారు.
Video Advertisement
ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆయన షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తున్నారు. సినిమాల్లో నటించిన డబ్బును సమాజానికి ఉపయోగపడే షార్ట్ ఫిలిమ్స్ చేసేందుకు ఉపయోగిస్తున్నారు ఎల్బీ శ్రీరామ్. ఇప్పటి వరకు 500 లకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన గత ఆరేళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నాడు. అడపా దడపా చిన్న చిన్న పాత్రలు చేస్తున్నారు కానీ.. ఎక్కువగా షార్ట్ ఫిలిమ్స్ నిర్మిస్తున్నారు. ఎల్బీ హార్ట్ ఫిలిమ్స్ తో ఆయన ఎన్నో సందేశాత్మక లఘు చిత్రాలు తెరకెక్కించారు. ఈ ఆరేళ్లలో ఆయన 60 కి పైగా షార్ట్ ఫిలిమ్స్ తీశారు.
ఇప్పటి వరకు ఎన్నో సందేశాత్మక కథాంశాలు సమాజానికి అందించానని ఎల్బీ శ్రీరామ్ గతం లో వెల్లడించారు. ఇదే సంతృప్తితో మరికొన్నాళ్లు సమాజానికి పనికొచ్చే లఘు చిత్రాలు తీస్తానని ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా నిత్యం ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. ఈ వయసులో కూడా ట్రెండీ దుస్తులు ధరించి ఆయన చేస్తున్న ఫోటోషూట్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ సీనియర్ నటుడు ప్రధాన పాత్ర పోషిస్తోన్న చిత్రం కవి సామ్రాట్. చాలా నెలల క్రితమే ఈ చిత్రం థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ మేకర్స్ ఫైనల్గా ఈ మూవీని ఓటీటీలో విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. త్వరలోనే సినిమా ప్రీమియర్ తేదీని ప్రకటించనున్నారు మేకర్స్. కవి సామ్రాట్ చిత్రంలో ప్రముఖ పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, నిర్మాత రాజ్ కందుకూరి, శ్రీ అన్వేష్, అనంత్, స్వప్న, రాఖీ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు.
End of Article