Ads
సంక్రాంతికి వచ్చిన అన్ని చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో అప్పుడు వాయిదా పడిన చిన్న చిత్రాలు ఫిబ్రవరిలో విడుదల అయ్యాయి. కానీ వాటిలో ఏవి హిట్ కాలేకపోయాయి. ఆ తర్వాత వచ్చిన సుధీర్ బాబు హంట్, కళ్యాణ్ రామ్ త్రి పాత్రాభినయం చేసిన అమిగోస్ కూడా ప్రేక్షకులను నిరాశ పరిచాయి. దీంతో ఈ వారం మహాశివరాత్రి సందర్భగా రిలీజ్ కానున్న చిత్రాలపై ఆసక్తి కనబరుస్తున్నారు ఫాన్స్. ఇక ఫిబ్రవరి 13 నుండి 18 వరకు థియేటర్ లో రిలీజ్ కాబోతున్న చిత్రాలేవో ఇప్పుడు చూద్దాం..
Video Advertisement
#1 సార్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో నేరుగా నటించిన మొదటి చిత్రం ‘సార్’. తమిళంలో ‘వాతి’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తొలిప్రేమ, మజ్ను, రంగ్‌దే చిత్రాలతో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సంయుక్త హీరోయిన్. ఇక ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
#2 షెహ్‌జాదా
అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ ఫిలిం ‘అల వైకుంఠపురములో’ హిందీలో ‘షెహ్‌జాదా’ పేరుతో రీమేక్ చేశారు. కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా.. రోహిత్ ధావన్ తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 17న విడుదలవుతోంది.
#3 వినరో భాగ్యము విష్ణు కథ
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘వినరో భాగ్యము విష్ణు కథ’. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కిరణ్ సరసన కశ్మీర పర్ధేశీ నటిస్తోంది. కొత్త దర్శకుడు మురళీ కిషోర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకి రానుంది.
#4 ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా మావ
యశ్వంత్, రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ ముఖ్య తారలుగా రేలంగి నరసింహా రావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కామెడీ హారర్ చిత్రం ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’. తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మించిన ఈ చిత్రం శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న రిలీజ్ అవుతోంది.
End of Article