కార్తీక్ ఆర్యన్ “షెహజాదా” (అల వైకుంఠపురములో రీమేక్) ఫస్ట్ రివ్యూ..! హిట్టా..? ఫట్టా..?

కార్తీక్ ఆర్యన్ “షెహజాదా” (అల వైకుంఠపురములో రీమేక్) ఫస్ట్ రివ్యూ..! హిట్టా..? ఫట్టా..?

by Anudeep

Ads

బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ కి ఎంత ఫాలోయింగ్ ఉందొ మనకి తెల్సిందే. ఎటువంటి సినీ బాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన కార్తీక్ ఆర్యన్ ఇండస్ట్రీ లో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయారు. ఈ ఏడాది వచ్చిన కార్తీక్‌కి ‘భూల్ భూలయ్యా 2’ ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. అయితే తాజాగా తెలుగులో భారీ విజయం అందుకొన్న అల వైకుంఠపురం చిత్రాన్ని హిందీలో కార్తీక్ ఆర్యన్ రీమేక్‌ చేస్తూ.. షెహ్‌జాదా టైటిల్‌తో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రం లో కృతి సనన్ హీరోయిన్.

Video Advertisement

డేవిడ్ ధావన్ కుమారుడు రోహిత్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మనీషా కోయిరాలా, పరేష్ రావల్, రోనిత్ రాయ్ మరియు సచిన్ ఖేడేకర్ కూడా నటించారు. ‘షెహజాదా’ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించారు. పఠాన్ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శిస్తున్నందున్న షెహజాదా చిత్రం రిలీజ్‌ను వాయిదా వేశారు. అనుకొన్న తేదీ ఫిబ్రవరి 10వ తేదీ కాకుండా ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

umair sandhu review about shehzada movie..

అయితే తాజాగా షెహజాదా చిత్రం ఫస్ట్ రివ్యూ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దుబాయ్ లో ఉంటూ ఇండియన్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు షెహజాదా మూవీ రివ్యూ చెప్పేసారు. ” షెహజాదా చిత్రం అన్ని రోహిత్ ధావన్ చిత్రాలు, అలవైకుంఠ పురం లో చిత్రాలను కలిపి తీసినట్లు ఉంది. కార్తిక్ ఆర్యన్ పెర్ఫార్మన్స్ యావరేజ్ గా ఉంది. కృతిసనన్ పాత్రకి ప్రాధాన్యత లేదు. మొత్తం గా ఇదొక యావరేజ్ మాస్ మసాలా చిత్రం..” అని ఉమైర్ సంధు ట్వీట్ చేసారు.

umair sandhu review about shehzada movie..

అయితే మరోవైపు షెహ్‌జాదా రిలీజ్ కంటే ముందుగానే అల వైకుంఠపురంలో సినిమా హిందీ డబ్బింగ్‌ను రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం తో ఇప్పుడు నిర్మాతలను ఆ భయం వెంటాడుతున్నది. అల వైకుంఠపురంలో సినిమా హిందీ డబ్బింగ్ హక్కులను గోల్డ్ మైన్ టెలిఫిల్మ్స్ సొంతం చేసుకొన్నది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్‌‌ను ఫిబ్రవరి 2వ తేదీన యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తామంటూ గోల్డ్ మైన్ ప్రకటన చేసింది. ఒకవేళ అల వైకుంఠపురంలో హిందీ డబ్బింగ్ సినిమా యూట్యూబ్‌లో ఉచితంగా ప్రదర్శిస్తే.. షెహజాదే సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మరి ఈ విషయం పై నిర్మాతలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.


End of Article

You may also like