Ads
ఫాల్గుణ మాసం చతుర్ధశి తిథి కృష్ణ పక్షం నాడు మహాశివరాత్రిని జరుపుకుంటారు. ఈ ఏడాది శివరాత్రి ఫిబ్రవరి 18న వచ్చింది. ఈ రోజున శివుడి భక్తులంతా ఉపవాసం ఉంటారు. రాత్రంతా జాగారం చేస్తారు. అయితే శివరాత్రి రోజున వివిధ హీరోల చిత్రాలను రాత్రి పూట ప్రదర్శిస్తారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా తమ అభిమాన హీరోల సూపర్ హిట్ సినిమాలను ఒక స్పెషల్ డే రోజున థియేటర్లలో మళ్లీ ప్రదర్శిస్తున్నారు.
Video Advertisement
ఇప్పుడు హైదరాబాద్ మొత్తం లో ఏ ఏ చిత్రాలు ఎక్కడ ప్రదర్శిస్తున్నారో తెలుసుకుందాం..
#1 అఖండ
నందమూరి నటసింహ బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీళ్ల కాంబినేషన్ లో గతేడాది వచ్చిన అఖండ సూపర్ హిట్ కొట్టింది. అయితే ఈ సినిమాను మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18న హైదరాబాద్ లోని సుదర్శన్ 35 ఎమ్ఎమ్ థియేటర్ లోఅర్ధ రాత్రి 12.15 గంటలకు, సుష్మ 70 ఎమ్ఎమ్ థియేటర్ లో రాత్రి 11.49 గంటలకు ప్రదర్శించనున్నారు.
#2 టెంపర్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, డ్యాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వంటి క్రేజీ కాంబినేషన్ వచ్చి.. ఎన్టీఆర్ కి బంపర్ కం బ్యాక్ ఇచ్చింది టెంపర్ మూవీ. ఈ చిత్రాన్ని మహా శివరాత్రి సందర్భంగా దేవి 70 ఎమ్ఎమ్ లో అర్థరాత్రి 12.15 గంటలకు, సంధ్య 35 ఎమ్ఎమ్ లో అర్థరాత్రి 12.30 గంటలకు షో వేయనున్నారు.
#3 వాల్తేరు వీరయ్య
బాబీ కొల్లి-చిరంజీవి-మాస్ మహారాజా రవితేజ వంటి క్రేజీ కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ కొట్టిన చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాను మహా శివరాత్రి సందర్భంగా చిరు, రవితేజ అభిమానుల కోసం మళ్లీ ప్రదర్శించనున్నారు. ఫిబ్రవరి 18న సంధ్య 70 ఎమ్ఎమ్ లో అర్థ రాత్రి 12.15 నిమిషాలకు, అలాగే ఉదయం 3 గంటలకు ప్రదర్శించనున్నారు.
#4 పుష్ప: ది రైజ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మూవీ పుష్ప. ఈ చిత్రాన్ని మహా శివరాత్రి రోజును పురస్కరించుకుని ఫిబ్రవరి 18న హైదరాబాద్ లోని సుష్మ 70 ఎమ్ఎమ్ థియేటర్ లో ఉదయం 3 గంటలకు షో వేయనున్నారు.
#5 రెబల్
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు దివంగత నటుడు కృష్ణంరాజు కూడా నటించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం చవిచూసింది. అయితే ఇప్పుడు ప్రభాస్ అభిమానుల కోసం ఫిబ్రవరి 18న హైదరాబాద్ లోని సంధ్య 35 ఎమ్ఎమ్ లో ఉదయం 3 గంటలకు ప్రదర్శించనున్నారు.
#6 కాంతార
హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార సినిమాను కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలీంస్ నిర్మించింది. సప్తమి గౌడ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18 న హైదరాబాద్ లోన సప్తగిరి 70 ఎమ్ఎమ్ థియేటర్ లో అర్థరాత్రి 12 గంటలకు, ఉదయం 3 గంటలకు స్క్రీనింగ్ చేయనున్నట్లు సమాచారం.
#7 సరిలేరు నీకెవ్వరు
సూపర్ స్టార్ మహేష్ – రష్మిక జంటగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం కూడా శివరాత్రి కి విడుదల కానుంది. ఇంకా ఏ థియేటర్ అన్నది తెలియాల్సి ఉంది.
#8 దూకుడు
మహేష్ – సమంత జంటగా శ్రీనువైట్ల తెరకెక్కించిన ఈ చిత్రం కూడా మహాశివరాత్రికి విడుదల కానుంది.
End of Article