Ads
తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరో ఎవరు? అంటే దానికి టక్కున సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే మన తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నంత మంది హీరోలు మరో సినీ పరిశ్రమలో లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరికి వారే సపరేట్ ఫ్యాన్ బేస్ తో, సపరేట్ ఇమేజ్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మన హీరోలు ఇప్పుడు ప్రపంచమంతా తమ వైపు తిప్పుకునే పనిలో పడ్డారు. ఈ మధ్యకాలంలో వరుసగా బాక్స్ ఆఫీస్ సక్సెస్ లను అందుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రేజ్ అందుకుంటున్నారు.
Video Advertisement
అయితే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల అత్యధిక స్థాయిలో క్రేజ్ అందుకున్న వారి లిస్ట్ ను ఆర్మాక్స్ రిలీజ్ చేసింది. ఇండియాలో మోస్ట్ పాపులర్ సర్వే కంపెనీ ఆర్మాక్స్ మీడియా ప్రతి నెల మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ సర్వే నిర్వహిస్తోంది. అలాగే జనవరి నెలలో డిజిటల్ మీడియా శాటిలైట్ ఆధారంగా సర్వే చేసి ఎక్కువగా పాపులర్ అయిన టాప్ టెన్ హీరోల ర్యాంక్స్ ను విడుదల చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
#1 ప్రభాస్
గత కొంత కాలంగా ఈ లిస్ట్ లో మొదటిగా నిలుస్తున్న ప్రభాస్ ఈ సారి కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రాధే శ్యామ్ లాంటి డిజాస్టర్ వచ్చినప్పటికీ కూడా ప్రభాస్ రేంజ్ అయితే అసలు తగ్గలేదు. ఏదో ఒక సినిమా గాసిప్స్ తో అయితే అతని పేరు వైరల్ గానే మారుతుంది.
#2 ఎన్టీఆర్
ఈ లిస్టులో ఎన్టీఆర్ రెండవ ర్యాంకు అందుకున్నాడు. ఇటీవల నాటు నాటు పాట ద్వారా అతనికి కూడా మంచి గుర్తింపు లభించింది.
#3 రామ్ చరణ్
ఆ తర్వాత మూడో స్థానం లో రామ్ చరణ్ ఉన్నాడు. ఇటీవల నాటు నాటు పాట ద్వారా చరణ్ కి కూడా అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
#4 అల్లు అర్జున్
ఇక ఈసారి అల్లు అర్జున్ నాలుగవ స్థానంలో నిలిచాడు. పుష్ప సెకండ్ పార్ట్ కు సంబంధించిన లుక్కు ద్వారా సోషల్ మీడియాలో బన్నీ ఎక్కువగా వైరల్ అయ్యాడు.
#5 మహేష్ బాబు
మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. అలాగే అతని లేటెస్ట్ లుక్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో మహేష్ అయిదవ స్థానం లో నిలిచాడు.
#6 పవన్ కళ్యాణ్
గతంలో టాప్ ప్లేస్ లో నిలిచిన పవన్ కళ్యాణ్ ర్యాంక్ ఈసారి మరి కొంత తగ్గింది. ఇక ఫైనల్ గా అతను మహేష్ బాబు తర్వాత ఆరవ స్థానానికి పరిమితం అయ్యాడు.
#7 చిరంజీవి
అలాగే సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా ఆర్మాక్స్ సర్వేలో మంచి ర్యాంకును అందుకుంటూ వస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని అనుకోవడంతో ఇప్పుడు ఆయన జనవరిలో ఏడో స్థానంలో నిలిచాడు.
#8 నాని
ఆ తర్వాతి స్థానం లో నేచురల్ స్టార్ నాని దసరా మూవీ అప్డేట్ ల ద్వారా వైరల్ అవుతున్నారు.
#9 రవితేజ
మాస్ మహారాజ రవితేజ కూడా కొన్నిసార్లు అగ్ర హీరోల తరహాలో క్రేజ్ అందుకుంటూ వస్తున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా రవితేజ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించాడు. ఇక ఇప్పుడు ఈ సర్వేలో అతను 9వ స్థానంలో నిలిచాడు.
#10 విజయ్ దేవరకొండ
ఇక చివరగా పదవ స్థానంలో విజయ్ దేవరకొండ స్థానం సంపాదించుకున్నాడు. జనవరిలో అతనికి సంబంధించిన మూవీ అప్డేట్స్ అయితే పెద్దగా రాలేదు. అయినప్పటికీ కూడా అతను సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు.
End of Article