Ads
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పాటలతో ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో ట్రోల్స్‌తో అంతకంటే ఎక్కువే నెగెటివిటీ ఎదర్కుంటున్నాడు. గతకొంత కాలంగా థమన్‌పై వస్తున్న ట్రోల్స్ బహుశా ఏ సంగీత దర్శకుడిపైన కూడా రాలేదేమో. అంతలా థమన్‌పై ట్రోలింగ్ జరుగుతుంది. కాపీ క్యాట్ అని, ఓకే రకమైన నేపథ్య సంగీతం ఇస్తాడని బోలెడన్ని ట్రోల్స్ వస్తునే ఉంటాయి. అయితే ఈ మధ్య థమన్ పాటలు ఇండియా వైడ్‌గా క్రేజ్ తెచ్చుకోవడంతో కాస్త నెగెటీవిటీ తగ్గింది. ముఖ్యంగా ‘అలవైకుంఠపురం’, ‘క్రాక్’, ‘అఖండ’, ‘భీమ్లానాయక్’ వంటి పలు సినిమాలకు పాటలతో, నేపథ్య సంగీతంతో ఊపిరి పోయడంతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు
Video Advertisement
థమన్ స్పీడు, జోష్, ట్రాక్ రికార్డు ఎంత గొప్పగా ఉన్నా సరే, ఎప్పుడూ ఏదొక రీజన్‌తో సోషల్ మీడియాలో టార్గెట్ అవుతూనే ఉంటాడు. కాపీ ట్యూన్లు అని ఒకసారి, హీరోలను ఆకాశానికెత్తడం పేరుతో మరోసారి ఇలా రీజన్ ఏదైతే ఏంటి ఏదో రకంగా యాంటీ ఫ్యాన్స్ థమన్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల థమన్ మ్యూజిక్ మళ్లీ రోటీన్ అయిపోయిందని, ఆల్రెడీ వాడిన ట్యూన్‌లోనే మళ్లీ కొడుతున్నాడని థమన్‌పై తెగ నెగిటీవిటీ స్ప్రెడ్ అవుతుంది. దాంతో మహేష్-త్రివిక్రమ్ సినిమా నుండి థమన్‌ను తొలిగించాలని సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు పోస్ట్‌లు పెట్టారు.
మరో వైపు తనపై ట్రోల్స్ కి థమన్ ఎప్పటికప్పుడు సమాధానం చెప్తూనే ఉన్నాడు. ప్రస్తుతం థమన్ చేతిలో మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో శంకర్-రామ్‌చరణ్ కాంబోలో తెరకెక్కుతన్న ‘ఆర్‌సీ15’ కూడా ఒకటి. ఇదే కాకుండా పవన్ చేయబోతున్న ‘వినోదయ సిత్తం’ రీమేక్, ‘ఓజీ’ సినిమాలకు కూడా థమనే సంగీత దర్శకుడు. అయితే తాజాగా మరోసారి ట్యూన్స్ రిపీట్ చేశాడంటూ నెట్టింట థమన్ పై ట్రోల్స్ స్టార్ట్ చేసారు నెటిజన్లు.
ఇటీవల థమన్ తమిళ హీరో విజయ్ చిత్రం వారసుడు కి పని చేసిన విషయం తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రం లోని ఫ్యామిలీ సాంగ్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సాంగ్ లో కూడా థమన్ తన ఓల్డ్ సాంగ్స్ లోని ట్యూన్స్ ఇచ్చాడంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. థమన్ గతం లో ఎన్టీఆర్ నటించిన ‘రామయ్య వస్తావయ్యా’ చిత్రానికి మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం లోని ‘ఓ లైలా..’ సాంగ్ ట్యూన్.. వరుస లోని ఫ్యామిలీ సాంగ్ ఒకటే ట్యూన్ అంటూ ఒక వీడియో ఎడిట్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.
watch video:
https://www.instagram.com/reel/CoU5dzXpV_2/?igshid=YmMyMTA2M2Y%3D
End of Article