Ads
టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అనుష్కకి .. ‘బాహుబలి’ చిత్రం తో పాన్ ఇండియా ఇమేజ్ వచ్చినా ఆమె దాన్ని ఉపయోగించుకోలేదు. ఆ తర్వాత అనుష్క భాగమతి, నిశ్శబ్దం చిత్రాలు చేసింది. కానీ ఆ చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక సినిమా ఉంది. అనుష్క ప్రస్తుతం నవీన్ పోలీస్ శెట్టి పక్కన హీరోయిన్ గా ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తోంది. యువి క్రియేషన్స్ ఈ సినిమా నిర్మిస్తోంది.
Video Advertisement
ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ మూవీకి `మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి` అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట. ఓ చెఫ్ పాత్రలో ఈమె కనిపించబోతున్నట్టు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఇవి మినహా అనుష్క బయట కనిపించి కూడా సంవత్సరాలు దాటుతోంది. దీంతో ఫాన్స్ అనుష్క కి ఏమైంది అంటూ ఆందోళన చెందుతున్నారు.
అయితే తాజాగా అనుష్క, కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు లో శివరాత్రి వేడుకలకు హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. దాదాపు రెండేళ్ల తర్వాత అనుష్క బయట కనిపించడం తో ఆమె ఫాన్స్ ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. అయితే అనుష్క ఈ ఫొటోల్లో చాలా బొద్దుగా కనిపిస్తున్నారు. అనుష్క లావు తగ్గేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా తగ్గకపోవడం తో ఆమె తదుపరి చిత్రం వాయిదా పడుతూ వస్తోందని సమాచారం.
దర్శకుడు మహేష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం లో అనుష్క అన్వితా రవళి శెట్టి అనే పాత్రలో కనిపించనుంది. ఇందులో ఆమె చెఫ్‌గా కనిపించనుందని లుక్ పోస్టర్ చూస్తే అర్థమైంది. సినిమాలో చేయబోయే చెఫ్ పాత్ర కోసం 10 మంది ప్రముఖ ఇంటర్నేషనల్, దేశీయ చెఫ్‌లతో కలిసి పని చేసిందట అనుష్క. రీసెంట్ షెడ్యూల్‌ని లండన్‌లో చిత్రీకరించారు. అనుష్క కెరీర్ లో వస్తున్న 48వ చిత్రమిది. ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో తెలియాల్సి ఉంది.
End of Article