Ads
‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ “సాలార్” చిత్రాన్ని చేస్తున్న విషయం మనకి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. సెప్టెంబర్ 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. అయితే ప్రభాస్ గత చిత్రాలు నిరాశ పరచడం తో సలార్ పై రెబల్ స్టార్ ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లుగా సర్వ హంగులతో ప్రశాంత్ నీల్ ఈ సినిమాను హ్యాండిల్ చేస్తున్నారు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకునే సర్వ హంగులతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
Video Advertisement
ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటకొచ్చిన అప్ డేట్స్ భారీ హైప్ తీసుకొచ్చాయి. కేజీఎఫ్ లాంటి భారీ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ప్రభాస్ సలార్ సినిమాతో ఆ సీన్ మళ్ళీ రిపీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం గురించి ఒక అప్డేట్ వైరల్ గా మారింది. తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ;లోకేష్ సినిమాటిక్ యూనివర్స్’ను మొదటిసారిగా ప్రేక్షకులకు పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సలార్ సినిమా ద్వారా ‘నీల్ వర్స్’ స్టార్ట్ చేయబోతున్నాడని తెలుస్తోంది.
ప్రభాస్, శ్రుతి హాసన్ జంటగా నటిస్తున్న ‘సలార్’ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే ఈ చిత్రంలో ‘కేజీఎఫ్’ స్టార్ యశ్ కేమియో రోల్ చేయనున్నాడని సమాచారం. అంతేకాదు ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్‌తో ఎండ్ అవుతుందట. అంటే తన రానున్న చిత్ర హీరో ని కూడా ఇందులో భాగం చేసి ఈ చిత్రం తో లింక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ‘కేజీఎఫ్’కు కూడా లింక్ ఉంటుందన్న మాట. ఈ అంశం పై సలార్ విడుదలయ్యాక క్లారిటీ వచ్చే అవకాశముంది. నిజానికి ప్రశాంత్ నీల్ గత చిత్రం ‘కేజీఎఫ్’, షూటింగ్ స్టేజ్‌లో ఉన్న ‘సలార్’ మూవీతో పాటు #NTR31 బ్యాక్‌గ్రౌండ్ థీమ్ కూడా ఒకేలా ఉన్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ద్వారా తెలుస్తోంది.
వరుస సినిమాలు లైన్ లో ఉన్నప్పటికీ సలార్ కోసం ప్రభాస్ కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబో చిరకాలం గుర్తుండేలా ఈ చిత్రంలోని సీన్స్ ఉండనున్నాయట. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై భారీ ఎత్తున ఈ సలార్ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు, మలయాళ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్, ఈశ్వరీరావు కీలక పాత్రలు పోషిస్తుండగా.. రవి బస్రూర్ బాణీలు కడుతున్నారు.
End of Article