Ads
టాలీవుడ్ లో మన పక్కింటి కుర్రాడి పాత్రల్లో కనిపించే అతి తక్కువ మంది హీరోల్లో మొదటి స్ధానంలో ఉంటాడు నాచురల్ స్టార్ నాని. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రల్లో ప్రేక్షకుల్ని మెప్పించడానికి తన ప్రయత్నం చేస్తుంటాడు.ఈ ప్రయత్నాల్లో మెజారిటీ సినిమాలు విజయవంతం అయినప్పటికీ, కొన్ని అపజయాలు కూడా నాని ని పలకరించాయి.
Video Advertisement
ఇటీవల వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో వచ్చిన అంటే సుందరానికి’ అనే మరో కొత్త కధ తో హిట్ కొట్టాడు. ఇక తర్వాత రానున్న చిత్రం దసరా తో మరో హిట్ కొట్టాలని నాని ట్రై చేస్తున్నాడు. అయితే నాని కెరీర్ లో బెస్ట్ పెరఫార్మెన్సు ఇచ్చిన చిత్రాలేవో ఇప్పుడు చూద్దాం..
#1 జెర్సీ
గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ చిత్రం లో నాని ఒక క్రికెటర్ గా కనిపించారు. ఈ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు వచ్చాయి.
#2 ఈగ
రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం లో నాని తక్కువ సేపే కనిపించినా.. అద్భుతంగా నటించారు.
#3 అలా మొదలైంది
లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించిన అలా మొదలైంది చిత్రం తో నాని సాలిడ్ హిట్ అందుకున్నారు.
#4 శ్యామ్ సింగ రాయ్
నాని, కృతి శెట్టి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో వచ్చిన పీరియాడిక్ మూవీ శ్యామ్ సింగ రాయ్ తో నాని తన నటనని మరో మెట్టు ఎక్కించాడు.
#5 గ్యాంగ్ లీడర్
ఒక అన్యాయానికి బలైపోయిన అయిదుగురు ఆడవాళ్ళకి అండగా నిలిచే పార్థ సారథి పాత్రలో నాని జీవించేసాడు.
#6 ఎవడే సుబ్రహ్మణ్యం
ఈ చిత్రం లో తన కెరీర్ పై ఫోకస్ పెట్టి మానవ సంబంధాల్ని వదిలేసే వ్యక్తి పాత్రలో నాని నటించారు.
#7 అంటే సుందరానికి..
తన ప్రేమకి గెలిపించుకునేందుకు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొనే సుందరం పాత్రలో నాని నటించి మెప్పించారు.
#8 నిన్ను కోరి
ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాతో శివ నిర్వాణ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ప్రేమ, పెళ్లి మధ్య సంఘర్షణ తో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
#9 కృష్ణ గాడి వీర ప్రేమగాథ
ఈ చిత్రం లో తన ప్రేమని బయటకి చెప్పుకోలేని పిరికి వాడి పాత్రలో నాని నటించి మెప్పించారు.
#10 భీమిలి కబడ్డీ జట్టు
దర్శకుడు తాతినేని ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో నాని తనలోని నటుడిని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.
#11 జెంటిల్ మాన్
దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ చిత్రం లో నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు.
#12 అష్టాచెమ్మా
దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన అష్టాచెమ్మా చిత్రం తో నాని హీరోగా ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు.
End of Article