“RRR సినిమాలో హాలీవుడ్ వాళ్ళకి ఏం నచ్చి ఉంటుంది..?” అన్న ప్రశ్నకి… ఈ నెటిజన్ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా..?

“RRR సినిమాలో హాలీవుడ్ వాళ్ళకి ఏం నచ్చి ఉంటుంది..?” అన్న ప్రశ్నకి… ఈ నెటిజన్ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా..?

by Anudeep

Ads

హై యాక్షన్ సీన్స్, ఎంగేజింగ్ స్టోరీ టెల్లింగ్‌తో ఇప్పటి వరకు ఏ ఇతర భారతీయ చిత్రం సాధించనంత గుర్తింపును ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా పొందింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ యాక్షన్-అడ్వెంచర్‌ దాదాపు రూ. 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇండియాతో పాటు అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం అమితంగా ప్రేక్షకాదరణ పొందింది.

Video Advertisement

అయితే హాలీవుడ్ వాళ్ళకి ఈ చిత్రం లో ఏం నచ్చి ఇన్ని అభినందనలు కురిపిస్తున్నారు..?? అని కోరా లో ఒక యూజర్ ప్రశ్నించారు. దీనికి బదులుగా చాల మంది సమాధానాలు ఇచ్చారు. అందులో ఒక యూజర్ ఇలా స్పందించారు. ఆర్ఆర్ఆర్ అనేది ఒక హిస్టారికల్ ఫిక్షన్. క్వింటన్ టోరెంటినో తీసిన ఇం గ్లోరియస్ బాస్టర్డ్స్ సినిమా, తెలుగులో వచ్చిన మాయ బజార్ చిత్రం కూడా ఇటువంటిదే. చరిత్రలో మనకి తెలిసిన వ్యక్తులను సంఘటనను వాడుకొని మనకి నచ్చినట్టుగా ఒక కథని చెప్పడం హిస్టారికల్ ఫిక్షన్ అంటారు. ఆర్ఆర్ఆర్ కూడా అటువంటి చిత్రమే. అలా తీసిన ఈ చిత్రం హాలీవుడ్ వాళ్ళకి కూడా నచ్చి ఉంటుంది. అందుకే ఈ చిత్రానికి ఎన్నో అవార్డులు వచ్చాయి అని కోరా లో ఒక యూజర్ సమాధానం చెప్పారు.

why RRR is so great..!! get the answer in Quora..

అలాగే హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కెమరూన్ కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. “ఆర్ఆర్ఆర్ అద్భుతమైన చిత్రం. నేను మొదటిసారి ఒక్కడినే కూర్చుని చూసినపుడు ఆశ్చర్యపోయాను. సినిమా రూపొందించిన విధానం, వీఎఫ్ఎక్స్ ఉపయోగించిన తీరే కాకుండా కథ చెప్పడంలోనూ షేక్ స్పియర్ నవల మాదిరి క్లాసిజం ఉంది. చాలా సవాల్‌తో కూడుకున్న రామ్ పాత్రను మలిచిన విధానం బాగుంది. ఇది భారీ గొప్ప విజయం అని నేను భావిస్తున్నాను” అని కామెరూన్ తెలిపారు.

why RRR is so great..!! get the answer in Quora..

టైటానిక్, అవతార్, అవతార్ 2 వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ జేమ్స్ కామెరూన్ ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకలలో రాజమౌళిని కలుసుకున్నారు. జక్కన్న టేకింగ్.. ఆయన మేధావి కథనం.. పాత్రలను నడిపించే భావోద్వాగాలపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు కోసం పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం చారిత్రాత్మక చిత్రం 28వ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో ‘ఉత్తమ విదేశీ భాషా చిత్రం’, ‘ఉత్తమ పాట’ అవార్డ్స్ కూడా గెలుచుకుంది.


End of Article

You may also like